Sunday, 29 March 2026
  • Home  
  • భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక
- నిర్మల్

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులకు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపిక

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కె. రఘునాథ్ (రసాయన శాస్త్రం సహాయ ఆచార్యులు), ఎం. శంకర్ (ఆంగ్ల సహాయ ఆచార్యులు) గారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా కళాశాలలో ఘనంగా అభినందన సభ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కరోల్ల బుచ్చయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, “విద్యార్థుల బాగు కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ ఉపాధ్యాయులు సర్వదా అభినందనీయులు. వీరి నిబద్ధత, కృషి ఇతర అధ్యాపకులకు ఆదర్శనీయమై నిలుస్తుంది” అని అభినందించారు. అధ్యాపకులు మరియు విద్యార్థులు కూడా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలను కొనియాడారు.

భైంసా ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు కె. రఘునాథ్ (రసాయన శాస్త్రం సహాయ ఆచార్యులు), ఎం. శంకర్ (ఆంగ్ల సహాయ ఆచార్యులు) గారు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికైన సందర్భంగా కళాశాలలో ఘనంగా అభినందన సభ నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్ శ్రీ కరోల్ల బుచ్చయ్య అధ్యక్షత వహించారు. కార్యక్రమంలో అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థులు, విద్యార్థినులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ, “విద్యార్థుల బాగు కోసం నిరంతరం కృషి చేస్తున్న ఈ ఉపాధ్యాయులు సర్వదా అభినందనీయులు. వీరి నిబద్ధత, కృషి ఇతర అధ్యాపకులకు ఆదర్శనీయమై నిలుస్తుంది” అని అభినందించారు.

అధ్యాపకులు మరియు విద్యార్థులు కూడా ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలియజేసి, వారి సేవలను కొనియాడారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.