ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భిక్షాటనను నివారించేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రాష్ట్రంలో భిక్షాటన చేయకుండా ఉండేలా ప్రభుత్వం జీ.ఓ నంబర్: 58ను జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం ప్రజా ప్రదేశాలు, దేవాలయాలు, బస్సు స్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మార్కెట్ ప్రాంతాల్లో యాచన చేయడం నిషేధం. భిక్షాటన చేసే వారిని గుర్తించి వారికి పునరావాసం కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టనుంది. సామాజిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని అమలు చేయాలని ప్రభుత్వం సూచించింది.

భిక్షాటన నిషేధానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నూతన ఆదేశాలు – జీ.ఓ నంబర్ 58 విడుదల