జనతా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని స్థానిక చిల్డ్రన్స్ పార్క్ లో మొక్కలు నాటే కార్యక్రమం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు ముక్కు రాధాకృష్ణ గౌడ్ మాట్లాడుతూ జనతా వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శ్రీరామనవమి పర్వదినాన్ని పురస్కరించుకొని చిల్డ్రన్స్ పార్క్ నందు వివిధ మొక్కలను నాటడం ద్వారా పర్యావరణాన్ని కాపాడడంతోపాటు పచ్చదనాన్ని పెంపొందించే పనిలో భాగంగా ప్రజలను జాగృతం చేసే కార్యక్రమాన్నిచేపట్టామని, అలాగే రాబోవు రోజుల్లో మిగతా అన్ని పార్కులలో మొక్కలు నాటే కార్యక్రమాన్నిచేస్తామన్నారు.వేగంగా విస్తరిస్తున్న నగరాలు దృష్ట్యా , పరిశ్రమలు,విపరీతమైన వాహనాలవలన విడుదలయ్యే కాలుష్యం దృష్ట్యా , ప్రజలందరూ కాలుష్య భూతంలో చిక్కుకుపోతున్న తరుణంలో, నగరమంతా కాంక్రీట్ జంగిల్ గా మారుతున్న పరిస్థితులను మనం చూస్తున్నామని దానిని నివారించే పనిలో భాగంగా ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటాలని జిల్లా ప్రజలకు పిలుపు నిచ్చారు. వేసవికాలంలో అంతకంతకు ప్రతి ఏటా పెరుగుతున్న అధిక ఉష్ణోగ్రతల దృష్ట్యా, అన్ని కాలాలలో అన్ని ఋతువులు సక్రమంగా వర్షాభావం లేని కారణంగా వాతావరణ సమతుల్యత దెబ్బతినిందని దీనికి పరిష్కారం మనందరం తప్పనిసరిగా మొక్కలు పెంచాలని అన్నారు . పై కార్యక్రమంలో జనతా వాకర్స్ అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శులు కాయల మధు, పోలిచెర్ల ఉదయ్ కుమార్ సభ్యులు బండ్ల ప్రసాద్ గౌడ్ వేనేటి సుధాకర్ గౌడ్, జంపాణి వంశీ గౌడ్, హర్షవర్ధన్ ,కిషోర్ ,జానకిరామ్ మహేష్ ,పార్థసారథి, కృష్ణమోహన్ మరియు ఇతర వాకర్సు మరియు క్రీడాకారులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగినది.