తల్లిదండ్రుల నుంచి హిందూ మహిళకు లభించిన ఆస్తిపై ఆమె భర్తకు హక్కులు ఉండవని హైకోర్టు స్పష్టం చేసింది. సంతానం లేకుండా మహిళ మరణిస్తే ఆ ఆస్తి ఆమె తండ్రి వారసులకే చెందుతుందని పేర్కొంది. అనకాపల్లి జిల్లా పెంటకోటకు చెందిన శ్రీవిరిత కేసులో, గిఫ్ట్ డీడ్ ద్వారా వచ్చిన భూమిపై భర్త హక్కుల వాదనను కోర్టు తిరస్కరించింది. దేవిక మానస పేరును రెవెన్యూ రికార్డుల్లో నమోదు చేయాలని ఆదేశించింది. హిందూ వారసత్వ చట్టం సెక్షన్ 15(2)(a) ప్రకారం జాయింట్ కలెక్టరు ఉత్తర్వులు చట్టవిరుద్ధమని తేల్చి, ఆర్డీఓ నిర్ణయాన్ని సమర్థించింది.

భార్య పుట్టింటి ఆస్తిపై భర్తకు హక్కుల్లేవు – హైకోర్టు కీలక తీర్పు