నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి )
సోమవారం (సెప్టెంబర్ 1) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి భారీ వర్షాలు,వరద నష్టాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టాలపై వేగవంతంగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రోడ్లు తెగిపోవడం లో లెవల్ కాజ్ వే, కల్వర్టుల డ్యామేజ్ ఇరిగేషన్ కి సంబంధించి మైనర్, మేజర్ ప్రాజెక్టులకి చెరువు
కట్టలకి చేయాల్సిన మరమ్మత్తులు సంబంధించిన వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ శాఖలకి సంబంధించిన నష్టాలపై వేగవంతంగా నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో హాజరైన వివిధ శాఖల మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ఆధికారులు, పలు సూచనలు చేశారు.

భారీ వర్షాలు, వరద నష్టాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన :ముఖ్యమంత్రి
నకిరేకల్ : సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం (సెప్టెంబర్ 1) రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హైదరాబాద్ నుండి భారీ వర్షాలు,వరద నష్టాలపై అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సంబంధిత శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యమంత్రి మాట్లాడుతూ ప్రకృతి విపత్తుల వల్ల జరిగిన నష్టాలపై వేగవంతంగా నివేదికలు సమర్పించాలని కలెక్టర్లను ఆదేశించారు రాష్ట్రవ్యాప్తంగా ఆర్ అండ్ బి పంచాయతీరాజ్ శాఖలకు చెందిన రోడ్లు తెగిపోవడం లో లెవల్ కాజ్ వే, కల్వర్టుల డ్యామేజ్ ఇరిగేషన్ కి సంబంధించి మైనర్, మేజర్ ప్రాజెక్టులకి చెరువు కట్టలకి చేయాల్సిన మరమ్మత్తులు సంబంధించిన వాటి గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఆ శాఖలకి సంబంధించిన నష్టాలపై వేగవంతంగా నివేదికలు సమర్పించాలని జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావును సీఎం ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్ లో హాజరైన వివిధ శాఖల మంత్రులు, సీనియర్ ఐఏఎస్ ఆధికారులు, పలు సూచనలు చేశారు.

