జిల్లా కలెక్టర్ స్వప్నల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర్ రెడ్డి తోఫోన్ లో మాట్లాడి నదులలో ప్రవాహ పరిస్థితులపై సమాచారం తీసుకున్నారు మంత్రి
సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @
బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా కురుస్తున్న వర్షాల దృష్ట్యా అధికారులు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర మంత్రి అచ్చెన్నాయుడు ఆదేశించారు. జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఎస్పీ మహేశ్వర రెడ్డిలతో సోమవారం సాయంత్రం మాట్లాడి వర్షపాతం, నదులలో ప్రవాహ పరిస్థితులపై ఆయన సమాచారం తీసుకున్నారు. మత్స్యకారులు సముద్రంలోకి వెళ్లకుండా ప్రభుత్వం జారీ చేసే బులెటిన్లను పాటించాలన్నారు. ముందు రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు సిద్ధంగా ఉండాలని మంత్రి సూచించారు. కాల్వలు, చెరువులపై క్షేత్రస్థాయి సిబ్బంది పర్యవేక్షణ చేయాలని ఇరిగేషన్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని వ్యవసాయ శాఖకు ప్రత్యేక సూచనలు చేశారు. విద్యుత్, రెవెన్యూ, పోలీస్, ఇరిగేషన్ శాఖలు కలసి వర్షాల ప్రభావాన్ని అంచనా వేసి చర్యలు చేపట్టాలని మంత్రి స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితులు తలెత్తితే వెంటనే నివేదించాలని ఆదేశించారు. ఉత్తర కోస్తాలో వచ్చే వారంలో 10–30 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరికలు, అలాగే వాతావరణ మార్పుల ప్రభావంతో సెప్టెంబరులో ఏర్పడే అల్పపీడనాలు వాయుగుండాలుగా మారి విశాఖ పరిసరాల్లో తీరం దాటే అవకాశం 60 శాతమని నిపుణులు చెబుతున్నారని, విపత్తుల నిర్వహణ సంస్థ కూడా రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ ఇప్పటికే తెలిపిందని మంత్రి అచ్చెన్నాయుడు గుర్తు చేశారు.


