భారీ వర్షానికి నేషనల్ హైవేపై కుప్పకూలిన బ్రిడ్జ్
తెలంగాణ : నాగర్ కర్నూలు జిల్లా ఉప్పునుంతల మండలం లతీపూర్ గ్రామ సమీపంలో హైదరాబాద్-శ్రీశైలం ప్రధాన రహదారిపై రాత్రి కురిసిన భారీ వర్షానికి డిండి వాగుపై నిర్మించిన వంతెన ఒక పక్కకు కూలిపోయింది. దీంతో హైదరాబాద్-శ్రీశైలం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే అప్రమత్తమై రాకపోకలను నిలిపివేశారు. తుఫాను ప్రభావంతో ఈ ఘటన చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది…


