— పున్నమి ప్రతినిధి
జర్మనీలోని బెర్లిన్ వేదికగా రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారి తీవ్ర విమర్శలు చేశారు. భారత్‌ను ప్రేమించే వ్యక్తి ఈ దేశం విఫలమవ్వాలని కోరుకుంటాడా అని ప్రశ్నించారు. ప్రజల మధ్య చిచ్చు పెంచేలా వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీ నిరంతరం భారత్ ప్రపంచ ప్రతిష్ఠను దెబ్బతీస్తోందని ఆయన పేర్కొన్నారు.


