Friday, 6 February 2026
  • Home  
  • భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్. జయంతి ఉత్సవ సభ ఏర్పాటు: ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి పెంచలరావు
- Featured - ఆంధ్రప్రదేశ్

భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్. జయంతి ఉత్సవ సభ ఏర్పాటు: ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి పెంచలరావు

    ఏపీ ఎన్జీవో భవనం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు నందు ఏపీ ఎన్జీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మన్నేపల్లి పెంచలరావు అధ్యక్షతన దార్శనికుడు పరిపాలన దక్షుడు భారత మాజీ ఉప ప్రధాని డాక్టర్ బాబు జగజీవన్ రామ్ జయంతి ఉత్సవ సభ ఏర్పాటు చేయడం జరిగినది.ముందుగా జగజ్జీవన్ రామ్ గారి చిత్ర పటానికి పూలమాలవేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సభనందు ఉద్దేశించి అధ్యక్షులు మాట్లాడుతూ భారతదేశ మాజీ ఉప ప్రధాని బడుగు వర్గాల హక్కుల పరిరక్షకుడు కీర్తిశేషులు డాక్టర్ బాబు జగజ్జివన్ రావు గారు భారత రాజకీయ రంగంలో అర్థ శతాబ్దానికి పైగా అగ్రశ్రేణి నేతగా శాసనసభ్యత్వం మొదలుకొని దేశ ఉప ప్రధాని వరకు ఎన్నో పదవులు అలంకరించి అసమాన ప్రజ్ఞా పాటవాలు కనబరిచి ఘన విజయాలు సాధించి మేరు పర్వతంలా మెలిగిన మహోన్నత జాతీయ నాయకులు బాబు జగజ్జివన్ రావు గారిని వీరు భారత దేశ రాజకీయాలలో ప్రత్యేకమైన స్థానాన్ని కలిగి ఉన్నారని,డాక్టర్ బాబు జగజీవన్ రావు గారు బీహార్ రాష్ట్రంలో షాబాద్ జిల్లాలోని చంద్వా గ్రామంలో శ్రీ శోభిరామ్ బసంత దేవి దంపతులకు 5/4/ 1908న జన్మించారని ఆయన తండ్రి కొంతకాలం బ్రిటీష్ సైన్యంలో పనిచేశారని అటు తర్వాత ఉద్యోగానికి రాజీనామా చేసి రైతుగా స్థిరపడ్డారని తెలిపారు ఆయన ఆధ్యాత్మిక చింతనాపరుడు బాబూజీ చిన్నతనం నుంచి ధర్మ ప్రవర్తన గురువుల యందు భక్తి శ్రద్ధలు కలిగివుండే వారు.1914 వ సంవత్సరంలో ఆయన ఆరా పట్టణంలో ప్రాథమిక పాఠశాలలో ప్రవేశించి 1921 వ సంవత్సరంలో మెట్రిక్ పూర్తి చేసి కళాశాల విద్యను బెనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో కొనసాగించారు మరియు 1931 వ సంవత్సరంలో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి బీఎస్సీ పట్టబద్రులైనారని తెలియజేశారు పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారు ప్రధానిగా ఉన్న తాత్కాలిక మంత్రివర్గంలో చేరిన మంత్రులలో బాబు జగజీవన్ రావ్ అందరికంటే చిన్న వయసు కలిగిన వారని తన పరిపాలన దక్షిత వలన ఎనలేని ప్రజాసేవ వలన నిరంతరం మంత్రివర్గంలో కొనసాగుతూ 1979 వ సంవత్సరంలో సీనియర్ మంత్రులలో ముఖ్యులుగా దేశ నాయకులలో అగ్రగామిగా ఉప ప్రధాని పదంలో నియమించబడినారని ఈ దేశ వ్యవహారములలో చురుకుగా పాల్గొనే వారని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి రామకృష్ణ అసోసియేట్ అధ్యక్షులు నందిమండలం ఆంజనేయ వర్మ ఆర్గనైజింగ్ కార్యదర్శి లక్కాకుల పెంచలయ్య ఉపాధ్యక్షురాలు ఈదురు కరుణమ్మ సంయుక్త కార్యదర్శి కృష్ణ కుమార్ నెల్లూరు నగర అధ్యక్షులు చిలక రామకృష్ణారెడ్డి, కార్యదర్శి మార్కండేయులు నగర కోశాధికారి సురేష్ కుమార్ నగర అసోసియేట్ అధ్యక్షులు స్వర్ణలత నగర సంయుక్త కార్యదర్శి రాధ కృష్ణ,మహిళా విభాగం జిల్లా కన్వీనర్ నవోదయ రమేష్ బాబు సీతారామయ్య మొదలగు వారు పాల్గొన్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.