-డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే ఇది సాధ్యమైందన్నారు
-రాజమహేంద్రి విద్యార్థుల భారీ ర్యాలీ.. సంబరాలు
-జయహో జయ జయహో భారత నారి అన్న రాజమహేంద్రి మహిళా కళాశాల విద్యార్ధినిలు
రాజమహేంద్రవరం :
భారత మహిళా జట్టు ప్రపంపకప్ గెలవడం చారిత్రాత్మకమని, దేశంలో ఉన్న మహిళలందరూ వారి విజయాన్ని చూసి గర్వపడుతున్నారని రాజమహేంద్రి విద్యాసంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి ఆనందం వ్యక్తం చేసారు. భారత మహిళల జట్టు వరల్డ్ కప్ గెలిచిన సందర్భాన్ని పురస్కరించుకుని రాజమహేంద్రి డిగ్రీ, పిజి కళాశాల విద్యార్థులు కళాశాల వద్ద నుంచి గోకవరం బస్టాండ్ అంబేద్కర్ విగ్రహం వరకు జాతీయ జెండాలతో ర్యాలీ నిర్వహించి అక్కడ సంబరాలు చేసుకున్నారు. ఈ కార్యక్రమానికి చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ తేతలి సత్య సౌందర్య ముఖ్య అతిథులుగా విచ్చేసారు. టీకే మాట్లాడుతూ భారత మహిళల జట్టు ప్రపంచకప్‌లో పోరాటం చేసి సౌత్ ఆఫ్రికాతో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో విజయం సాధించడం అందరికి స్ఫూర్తిదాయకమని కొనియాడారు. నేడు మహిళలు అన్ని రంగాల్లో ముందడుగు వేస్తున్నారనడానికి ఇదే నిదర్శనమన్నారు. విమానాలు నడిపే పైలట్లుగా, రైళ్లు నడిపే లోకో పైలట్లుగా, ఆటోడ్రైవర్లుగా కూడా తాము సాధించలేని ఏది లేదన్నట్టుగా కుటుంబాన్ని ముందుకు నడిపించడానికి అన్ని విధాలుగాను ముందుకు సాగుతున్నారన్నారు. గెలిచిన భారత జట్టుకి బిసిసిఐ 37 కోట్లు ప్రైజ్ మనీగా ప్రకటించడం జరిగిందని, వారి విజయాన్ని చూసి ప్రపంచమంతా గర్వపడుతోందన్నారు. ప్రపంచమేధావి, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మహిళలకు ఇచ్చిన స్వేచ్ఛ వల్లనే ఇది సాధ్యమైందన్నారు. ఇదే స్ఫూర్తితో రానున్న రోజుల్లో మరిన్ని విజయాలు సాధించడానికి మహిళల జట్టుకి శుభాకాంక్షలు తెలిపారు. తేతలి సత్య సౌందర్య మాట్లాడుతూ ఇండియా మహిళా జట్టు ఆల్‌రౌండర్లుగా అన్ని జట్లతో పోరాటం చేసి వరల్డ్ కప్‌ని సాధించడం గర్వకారమన్నారు. తమ కళాశాలలో విద్యార్థినులను కూడా ఆల్ రౌండర్లుగా తీర్చిదిద్దుతున్నామని, ఏ రంగమైనా మహిళలు తమను తాము నిరూపించుకునేలా చేయడమే తమ లక్ష్యమన్నారు. దీనికి ముందుకు రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేసారు.
కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ ఎంకెఎస్ ప్రసాద్, ఎన్.ఎస్.ఎస్. పిఓ దంటు వీర వెంకటరావు, కళాశాల అధ్యాపకులు జ్యోతిర్మయి, అనూష, శుభదేవి, కీర్తి అధ్యాపకేత్ర సిబ్బంది వీరస్వామి, శాంతి, నాగమ్మ, కళాశాల ఎన్.ఎస్.ఎస్. వాలంటీర్లు తది తదితరులు పాల్గొన్నారు.


