Sunday, 7 December 2025
  • Home  
  • భారత కోచ్ నుంచి అంతర్జాతీయ విజేతగా చెయ్యనూరు సాయికుమార్ విజయయాత్ర
- జాతీయ అంతర్జాతీయ

భారత కోచ్ నుంచి అంతర్జాతీయ విజేతగా చెయ్యనూరు సాయికుమార్ విజయయాత్ర

చికాగో రాష్ట్ర విజేతగా చెయ్యనూరు సర్వత్రా అభినందనల జల్లులు ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ గూడూరు : భారత బ్యాడ్మింటన్‌లో కోచ్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చెయ్యనూరు సాయికుమార్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై క్రీడాకారుడిగా కూడా విజయాలు సాధిస్తున్నారు. ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన సాయికుమార్, చిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకుని, ఆ ఆసక్తిని వృత్తిగా మార్చుకున్నారు. కోచ్‌గా ఆయనకు ఉన్న గుర్తింపు వెనుక బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ లెవల్ 1 కోచింగ్ సర్టిఫికేషన్, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ వంటి అర్హతలు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందించే స్థాయికి చేర్చాయి. సాయికుమార్ శిక్షణలో ఉన్న క్రీడాకారులు స్టేట్ ఛాంపియన్ల నుంచి నేషనల్ మెడలిస్టుల వరకు ఎదగడం విశేషం. ఆయన శిష్యుల్లో కొందరు ఇప్పటికే భారతదేశానికి అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులను ప్రోత్సహించడం, వారికి ఉచిత శిక్షణ ఇవ్వడం ఆయన కోచింగ్ తత్వంలో ఒక ముఖ్యమైన భాగం. యూఎస్ చికాగో రాష్ట్ర చాంపియన్ గా మిక్సడ్ డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. అమెరికాలోని చికాగోలో రెడ్ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్రేట్ బాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో సాయి కుమార్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచారు. సెమీస్‌లో చైనా ఆటగాళ్లు స్టీవెన్ జియాజ్ లీ – ఎరికా చెన్ లిన్ పై 21-16, 21-10తో విజయం సాధించారు. ఫైనల్స్‌లో మలేషియా ఆటగాడు ఆండీ ఐక్ ట్షాంగ్ ఎన్ – చైనా ఆటగాడు రురు జాంగ్ పై 15-21, 21-12, 21-16 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. అలాగే అనేక అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి, యూఎస్ నేషనల్స్ పోటీలకు అర్హత పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల విజయమే నా గొప్ప పతకం అన్నారు. కానీ ఆటగాడిగా నా విజయాలు వారికి నమ్మకాన్ని ఇస్తాయని, ఈ రెండు పాత్రల సమ్మేళనం నన్ను ముందుకు నడిపిస్తోందన్నారు. క్రీడలో క్రమశిక్షణ, కోచింగ్‌లో నిబద్ధత, శిష్యుల పట్ల మమకారం ఈ గుణాలు తనను అంతర్జాతీయ వేదికపై ప్రత్యేకంగా నిలబెట్టాయన్నారు. నెల రోజుల క్రితం అట్లాంటా రాష్ట్రం, ప్రస్తుతం చికాగో రాష్ట్ర ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ సాధించడం పట్ల సాయి కుమార్ ప్రతిభ కేవలం గూడూరుకే కాకుండా, మొత్తం భారతదేశానికి గర్వకారణమని క్రీడాభిమానులు అభినందనల జల్లులు కురిపిస్తున్నారు.

చికాగో రాష్ట్ర విజేతగా చెయ్యనూరు

సర్వత్రా అభినందనల జల్లులు

ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ గూడూరు :

భారత బ్యాడ్మింటన్‌లో కోచ్‌గా తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్న చెయ్యనూరు సాయికుమార్, ఇప్పుడు అంతర్జాతీయ వేదికపై క్రీడాకారుడిగా కూడా విజయాలు సాధిస్తున్నారు.
ఉమ్మడి నెల్లూరు జిల్లా గూడూరుకు చెందిన సాయికుమార్, చిన్న వయసులోనే బ్యాడ్మింటన్‌పై ఆసక్తి పెంచుకుని, ఆ ఆసక్తిని వృత్తిగా మార్చుకున్నారు. కోచ్‌గా ఆయనకు ఉన్న గుర్తింపు వెనుక బాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్ లెవల్ 1 కోచింగ్ సర్టిఫికేషన్, నేషనల్ అడ్మినిస్ట్రేషన్ కోర్స్ వంటి అర్హతలు అంతర్జాతీయ ప్రమాణాలతో శిక్షణ అందించే స్థాయికి చేర్చాయి. సాయికుమార్ శిక్షణలో ఉన్న క్రీడాకారులు స్టేట్ ఛాంపియన్ల నుంచి నేషనల్ మెడలిస్టుల వరకు ఎదగడం విశేషం. ఆయన శిష్యుల్లో కొందరు ఇప్పటికే భారతదేశానికి అంతర్జాతీయ వేదికపై ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులను ప్రోత్సహించడం, వారికి ఉచిత శిక్షణ ఇవ్వడం ఆయన కోచింగ్ తత్వంలో ఒక ముఖ్యమైన భాగం. యూఎస్ చికాగో రాష్ట్ర చాంపియన్ గా మిక్సడ్ డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించారు. అమెరికాలోని చికాగోలో రెడ్ క్రాస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఎగ్రేట్ బాడ్మింటన్ అకాడమీలో నిర్వహించిన ప్రతిష్టాత్మక టోర్నమెంట్‌లో సాయి కుమార్ మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో గోల్డ్ మెడల్ గెలిచారు. సెమీస్‌లో చైనా ఆటగాళ్లు స్టీవెన్ జియాజ్ లీ – ఎరికా చెన్ లిన్ పై 21-16, 21-10తో విజయం సాధించారు. ఫైనల్స్‌లో మలేషియా ఆటగాడు ఆండీ ఐక్ ట్షాంగ్ ఎన్ – చైనా ఆటగాడు రురు జాంగ్ పై 15-21, 21-12, 21-16 తేడాతో గెలిచి గోల్డ్ మెడల్ దక్కించుకున్నారు. అలాగే అనేక అంతర్జాతీయ పోటీల్లో పతకాలు సాధించి, యూఎస్ నేషనల్స్ పోటీలకు అర్హత పొందారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడాకారుల విజయమే నా గొప్ప పతకం అన్నారు. కానీ ఆటగాడిగా నా విజయాలు వారికి నమ్మకాన్ని ఇస్తాయని, ఈ రెండు పాత్రల సమ్మేళనం నన్ను ముందుకు నడిపిస్తోందన్నారు. క్రీడలో క్రమశిక్షణ, కోచింగ్‌లో నిబద్ధత, శిష్యుల పట్ల మమకారం ఈ గుణాలు తనను అంతర్జాతీయ వేదికపై ప్రత్యేకంగా నిలబెట్టాయన్నారు. నెల రోజుల క్రితం అట్లాంటా రాష్ట్రం, ప్రస్తుతం చికాగో రాష్ట్ర ఛాంపియన్ గా గోల్డ్ మెడల్ సాధించడం పట్ల సాయి కుమార్ ప్రతిభ కేవలం గూడూరుకే కాకుండా, మొత్తం భారతదేశానికి గర్వకారణమని క్రీడాభిమానులు అభినందనల జల్లులు కురిపిస్తున్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.