*లేదంటే భారత్ మాల రోడ్డు పనులు నిలిపివేస్తాం*
*భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ ఆధ్వర్యంలో రైతులతో*
*జిల్లా కలెక్టర్ సంతోష్ గారికి వినతి పత్రం
అందజేత*
జోగులాంబ గద్వాల జిల్లా, గట్టు భారత్ మాల రోడ్డు క్రింద భూములు కోల్పోయిన రైతులకు రెండో విడత అవార్డు డబ్బులు మంజూరు చేయాలనీ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ఇంచార్జి మాచర్ల ప్రకాష్ అన్నారు ఈ రోజు గట్టు, గంగిమాన్ దొడ్డి, సల్కపురం రైతులతో కలసి జిల్లా కలెక్టర్ సంతోష్ గారికి వినతి పత్రం అందజేశారు 6 నెలలుగా రైతులు కార్యాలయం చుట్టూ తిరుగుతూ ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు వెంటనే మంజూరు చేయాలనీ అన్నరు భారత్ మాల రోడ్డు పనులు పూర్తికావస్తున్న ఇంకా రైతులకు రెండో విడత డబ్బులు మంజూరు చేయకపోవడం చాలా అన్యాయం అని అన్నారు మంజూరు చేయకపోతే భరత్ మాల రోడ్డు పనులు నిలిపివేస్తామని అన్నారు వెంటనే మంజురు చేస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు
ఈ కార్యక్రమం లో గంగిమాన్ దొడ్డి మాజీ సర్పంచ్ సంతోష్,మూడు గ్రామాల రైతులు పాల్గొన్నారు


