Sunday, 7 December 2025
  • Home  
  • “భారత్ మాతాకీ జై…. అంటూ,’ కామారెడ్డి జిల్లాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల పాద సంచాలనం
- కామారెడ్డి

“భారత్ మాతాకీ జై…. అంటూ,’ కామారెడ్డి జిల్లాలో ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల పాద సంచాలనం

కామారెడ్డి, 05 అక్టోబర్ పున్నమి ప్రతినిధి : కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సంద ర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న శతాబ్ది ఉత్స వాలలో భాగంగా, మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అద్భుతమైన పాద సంచాలన (రూట్ మార్చ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాత రం’ వంటి నినాదాలు మార్మోగుతుండగా, గణవేష్ (నిర్దిష్ట యూనిఫామ్) ధరించిన స్వయంసేవకులు క్రమ శిక్షణతో పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శ న జరిపారు.పాద సంచాలనం అనంతరం నిర్వ హించిన సభలో ప్రధాన వక్త యాదిరెడ్డి ప్రసంగిం చారు. ఆయన సంఘ్ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ, జాతీయవాదం, సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ పోషిస్తు న్న పాత్రను వివరించారు. యాదిరెడ్డి మాట్లాడు తూ, “100 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ యాత్ర, దేశ భక్తిని, క్రమశిక్షణను ప్రతి భారతీయుడిలోనూ నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని గుర్తు చేశారు.స్వయంసేవకులుగా మనం నిస్వార్థం గా దేశానికి సేవ చేయడానికి, సమాజంలో సకారా త్మక మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి,” అని ఉద్బోధించారు. ఈ శతాబ్ది ఉత్సవాలు కేవ లం వేడుకలు మాత్రమే కాదని, రాబోయే తరాలకు మన సంస్కృతి, సంస్కారాల విలువను తెలియ జేసే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. రామారెడ్డి వీధుల్లో క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన రామారెడ్డి మండల కేంద్రంలోని ముఖ్య కూడళ్లు, ప్రధాన రహ దారుల గుండా సాగిన ఈ పాద సంచాలనం స్థాని కులను విశేషంగా ఆకట్టుకుంది. ఆర్ఎస్ఎస్ కార్య కర్తల పక్కా క్రమశిక్షణ, సామరస్యం వారి పట్టు దలను, సంఘటిత శక్తిని ప్రస్ఫుటం చేశాయి. ఈ కార్యక్రమం ద్వారా, ఆర్ఎస్ఎస్ తన వ్యవస్థాపక సిద్ధాంతాలను, భావజాలాన్ని విస్తృత జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభి ప్రాయపడుతున్నారు. దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధంగా ఉన్నదనే సందేశాన్ని ఈ శతాబ్ది ఉత్సవాలు బలంగా చాటి చెప్తున్నాయని నిర్మోహమాటంగా చెప్పారు.

కామారెడ్డి, 05 అక్టోబర్ పున్నమి ప్రతినిధి :

కామారెడ్డి జిల్లా, రామారెడ్డి మండల కేంద్రంలో రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ (ఆర్ఎస్ఎస్) స్థాపించి 100 సంవత్సరాలు పూర్తవుతున్న సంద ర్భంగా దేశవ్యాప్తంగా జరుగుతున్న శతాబ్ది ఉత్స వాలలో భాగంగా, మండల కేంద్రంలో ఆదివారం ఉదయం ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు అద్భుతమైన పాద సంచాలన (రూట్ మార్చ్) కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘భారత్ మాతాకీ జై’, ‘వందేమాత రం’ వంటి నినాదాలు మార్మోగుతుండగా, గణవేష్ (నిర్దిష్ట యూనిఫామ్) ధరించిన స్వయంసేవకులు క్రమ శిక్షణతో పట్టణ ప్రధాన వీధుల గుండా ప్రదర్శ న జరిపారు.పాద సంచాలనం అనంతరం నిర్వ హించిన సభలో ప్రధాన వక్త యాదిరెడ్డి ప్రసంగిం చారు. ఆయన సంఘ్ 100 సంవత్సరాల సుదీర్ఘ ప్రస్థానాన్ని గుర్తు చేస్తూ, జాతీయవాదం, సమాజ సేవ, సంస్కృతి పరిరక్షణలో ఆర్ఎస్ఎస్ పోషిస్తు న్న పాత్రను వివరించారు. యాదిరెడ్డి మాట్లాడు తూ, “100 ఏళ్ల క్రితం ప్రారంభమైన ఈ యాత్ర, దేశ భక్తిని, క్రమశిక్షణను ప్రతి భారతీయుడిలోనూ నింపడమే లక్ష్యంగా ముందుకు సాగుతోందని గుర్తు చేశారు.స్వయంసేవకులుగా మనం నిస్వార్థం గా దేశానికి సేవ చేయడానికి, సమాజంలో సకారా త్మక మార్పు తీసుకురావడానికి కృషి చేయాలి,” అని ఉద్బోధించారు. ఈ శతాబ్ది ఉత్సవాలు కేవ లం వేడుకలు మాత్రమే కాదని, రాబోయే తరాలకు మన సంస్కృతి, సంస్కారాల విలువను తెలియ జేసే గొప్ప అవకాశం అని పేర్కొన్నారు. రామారెడ్డి వీధుల్లో క్రమశిక్షణతో కూడిన ప్రదర్శన రామారెడ్డి మండల కేంద్రంలోని ముఖ్య కూడళ్లు, ప్రధాన రహ దారుల గుండా సాగిన ఈ పాద సంచాలనం స్థాని కులను విశేషంగా ఆకట్టుకుంది. ఆర్ఎస్ఎస్ కార్య కర్తల పక్కా క్రమశిక్షణ, సామరస్యం వారి పట్టు దలను, సంఘటిత శక్తిని ప్రస్ఫుటం చేశాయి. ఈ కార్యక్రమం ద్వారా, ఆర్ఎస్ఎస్ తన వ్యవస్థాపక సిద్ధాంతాలను, భావజాలాన్ని విస్తృత జనంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తోందని విశ్లేషకులు అభి ప్రాయపడుతున్నారు. దేశ నిర్మాణంలో తమ వంతు పాత్ర పోషించడానికి రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సిద్ధంగా ఉన్నదనే సందేశాన్ని ఈ శతాబ్ది ఉత్సవాలు బలంగా చాటి చెప్తున్నాయని నిర్మోహమాటంగా చెప్పారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.