— పున్నమి ప్రతినిధి
వచ్చే ఏడాది జనవరిలో న్యూజిలాండ్ పురుషుల క్రికెట్ జట్టు భారత పర్యటనకు రానుంది. ఈ పర్యటనలో భాగంగా మూడు వన్డేలు, ఐదు టీ20ల సిరీస్‌లు జరగనున్నాయి. అయితే టీమిండియాతో జరిగే వన్డే సిరీస్‌కు న్యూజిలాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కేన్ విలియమ్సన్ దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు నివేదికలు వెల్లడించాయి. ఇదిలా ఉండగా, 2026 టీ20 ప్రపంచకప్‌తో పాటు న్యూజిలాండ్‌లో జరగనున్న టీ20 సిరీస్‌కు భారత జట్టును బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది.


