*భవిష్యత్ తరాలకు న్యాయం చేసేలా పని చేస్తున్న ప్రభుత్వం*
*విద్యా వ్యవస్థలో సమూల మార్పులతో నాణ్యమైన విద్యా ప్రమాణాలు*
*టీడీపీ హయాంలోనే అధిక శాతం ఉపాధ్యాయుల నియామకం*
*ఉపాధ్యాయుల సమస్యలన్నీంటి పరిష్కారానికి ప్రభుత్వం కృషి*
*గురుపూజోత్సవ కార్యక్రమంలో పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ రెడ్డి*
కూటమి ప్రభుత్వం భవిష్యత్ తరాలకు న్యాయం చేయాలని తలంపుతో పనిచేస్తుందని పలమనేరు శాసనసభ్యులు అమర్నాథరెడ్డి పేర్కొన్నారు. గంగవరం మండలంలోని ఓ ప్రైవేటు కల్యాణ మండపంలో జరిగిన పలమనేరు మరియు గంగవరం మండల ఉపాధ్యాయుల గురుపూజోత్సవ కార్యక్రమానికి సోమవారం ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించిన ఆయన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ…. ఉపాధ్యాయులే సమాజ నిర్దేశ్యకులని భావితరాలను తీర్చిదిద్దాల్సిన బాధ్యత మీదేనన్నారు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం ఉపాధ్యాయులకు సముచిత స్థానం కల్పిస్తూ వస్తోందని టిడిపి హయాంలోనే అధిక శాతం ఉపాధ్యాయ పోస్టులు భర్తీ అయిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇక ప్రస్తుత ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో పనిచేస్తుందన్నారు. విద్యావ్యవస్థలో సమూల మార్పులను తీసుకొస్తూ విద్య ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకెళ్తోందని తెలిపారు. భవిష్యత్ తరాలకు మంచి విద్యను అందించే రాష్ట్ర అభివృద్ధిలో ఉపాధ్యాయులు కీలక భూమిక పోషించాలని ఆయన కోరారు. అదేవిధంగా స్థానికంగా ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి తన వంతు సహాయ సహకారాలు ఉంటాయని ఆయన వారికి భరోసా కల్పించారు. తదనంతరం ఉత్తమ ఉపాధ్యాయులుగా రాణించిన వారిని సన్మానించి జ్ఞాపికతో పాటు దృవపత్రాలను ఆయన అందజేశారు. చివరిగా త్వరలో పదవీ విరమణ చెందనున్న పలువురు ఉపాధ్యాయులను సైతం ఆయన సన్మానించారు.
ఈ కార్యక్రమాలలో గంగవరం, పలమనేరు ఎంఈఓలు లీలారాణి, వేణుగోపాల్ రెడ్డి, బాలసుందరం, శ్రీనివాసులతో పాటు సీనియర్ ఉపాధ్యాయులు తులసీనాదం నాయుడు,లక్ష్మీనారాయణ, సుదర్శన ఆచారి, బాలకృష్ణ, కుబేర్ నాయుడు, సాలెహ, భాస్కర్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకులు రాజన్న, సోమశేఖర్ గౌడ్, నాగరాజు రెడ్డి, గణేష్, గిరిధర్ గోపాల్ తదితరులున్నారు..


