నంద్యాల జిల్లా జనసేన నాయకుడు భవనాశి శ్రీనివాస, భవనాశి నాగ మహేష్ ఆధ్వర్యంలో నంద్యాల నుండి జనసేన నాయకులు 80 వాహనాల్లో తరలివెళ్లారు భవనాశి సోదరుల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జనసేన నాయకులు కార్యకర్తలు ప్రధాని సభలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా భవనాశి సోదరులు భవనాశి శ్రీనివాస,భవనాశి నాగ మహేష్ మాట్లాడుతూ కర్నూలు సమీపంలోని నన్నూరు దగ్గర ఏర్పాటు చేసిన ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ సభ సూపర్ సక్సెస్ అయ్యిందన్నారు. బహిరంగ సభకు సుమారు ఐదు లక్షల మంది హాజరయ్యారన్నారు.ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్రంలో రూ.13,340 కోట్ల విలువైన పలు కీలక ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా, ప్రధాని మోదీ రూ.9,449 కోట్ల విలువైన పనులకు శంకుస్థాపన చేయగా, మరో రూ.1,704 కోట్ల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించారన్నారు.. ఇప్పటికే నిర్మాణం పూర్తయిన రూ.2,276 కోట్ల విలువైన పనులను ఆయన జాతికి అంకితం చేశారని తెలిపారు
**రాయలసీమ అభివృద్ధికి పెద్దపీట*
కొత్తగా శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులలో రాయలసీమ అభివృద్ధికి కీలకమైన ఓర్వకల్లు, కొప్పర్తి ఇండస్ట్రియల్ కారిడార్‌లు ఉన్నాయని,వీటి నిర్మాణానికి రూ.4,920 కోట్లు కేటాయించారన్నారు కర్నూలులో విద్యుత్ మౌలిక వసతుల బలోపేతానికి రూ.2,880 కోట్లతో ఏర్పాటు చేయనున్న విద్యుత్ ట్రాన్స్‌మిషన్ వ్యవస్థకు కూడా ప్రధాని పునాదిరాయి వేశారన్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసికట్టుగా పనిచేయడంతో అభివృద్ధి పరుగులు పెడుతోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ రూపంలో రాష్ట్రానికి శక్తిమంతమైన నాయకత్వం లభించిందని, ఈ డబుల్ ఇంజిన్ సర్కార్ పాలనలో గత 16 నెలలుగా ఏపీ అపూర్వ ప్రగతి సాధిస్తోందని తెలిపారు.కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన జీఎస్టీ సంస్కరణలు (జీఎస్టీ 2.0) రాష్ట్ర ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురానున్నాయని, ఈ ప్రయోజనాలను ప్రతి ఇంటికీ చేరవేసేందుకు జనసేన పార్టీ తరపున కృషి చేస్తామని ఈ సంస్కరణల ఫలితంగా రాష్ట్ర ప్రజలకు ఏకంగా రూ.8,000 కోట్ల మేర ఆర్థిక ప్రయోజనం చేకూరుతుందని, జీఎస్టీ 2.0 సంస్కరణల ఫలాలు రాష్ట్రంలోని ప్రతి పౌరుడికీ అందేలా చూడటమే జనసేన పార్టీ ద్యేయమన్నారు పేద, మధ్యతరగతి వర్గాల జీవితాలను మార్చే శక్తి ఈ సంస్కరణలకు ఉందని అభిప్రాయపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించుకున్న ముఖ్యంగా 99 శాతం నిత్యావసర వస్తువులపై పన్ను సున్నా శాతానికి చేరడం వల్ల సామాన్యులపై భారం గణనీయంగా తగ్గుతుందని ఆయన పేర్కొన్నారు.
ఈ సంస్కరణల వల్ల కేవలం వినియోగదారులకే కాకుండా, చిన్న వ్యాపారాలు, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు (ఎంఎస్ఎంఈ) కూడా పెద్ద ఎత్తున ప్రయోజనం కలుగుతుందని అన్నారు. ‘మేక్ ఇన్ ఇండియా’, స్వదేశీ నినాదాలకు ఈ సంస్కరణలు ఊతమిస్తాయని, భారతీయ ఉత్పత్తులు ప్రపంచ బ్రాండ్లతో పోటీ పడేందుకు మార్గం సుగమం అవుతుందని చెప్పారు. ప్రతి ఒక్కరూ భారతీయ ఉత్పత్తులను కొనుగోలు చేసి దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో జనసేన పార్టీ నాయకులు నాగి వెంకటేశ్వర్లు, దండు మురళీకృష్ణ మారాజు గురు బాబు హరిప్రసాద్ కృష్ణ గౌడ్ దినేష్ మరియు జన సైనికులు బిజెపి నాయకులు చంద్రశేఖర్ ప్రసాద్ రాజు తదితరులు పాల్గొన్నారు


