భర్తతో కాపురం కోసం భార్య నిరసన – ఇంటి ముందు నిరాహార దీక్షకు కూర్చొన్న శారద
అన్నమయ్య జిల్లా నందలూరు మండలం అరవపల్లె గ్రామంలో భర్తతో కాపురం కోసం శారద అనే మహిళ గురువారం తన తండ్రితో కలిసి భర్త ఇంటి ముందు నిరాహార దీక్షకు దిగింది. దేవేంద్ర ప్రసాద్ అనే భర్త 2014లో శారదను వివాహం చేసుకున్నాడు. తర్వాత తల్లి ఒత్తిడి వల్ల భార్యను విడిచిపెట్టిన దేవేంద్ర, ఆమె అంగీకారం లేకుండానే కోర్టు ద్వారా విడాకులు తీసుకున్నాడు. రాజంపేట కోర్టులో విడాకులు రద్దు చేయించుకున్న శారద గత ఆరు నెలలుగా కాపురం కోసం ప్రయత్నిస్తోంది. అయినా భర్త ఇంటికి తాళం వేసి వెళ్లిపోవడంతో ఆమె తండ్రితో కలిసి ఇంటి మెట్లపై నిరసన తెలిపారు. “భర్తతోనే జీవించాలన్నదే నా కోరిక” అని శారద అంటున్నారు.

