Monday, 8 December 2025
  • Home  
  • భరత్ నీలా సూట్ కేసులు గురించి ఆలోచించను కార్మికులు బాగుండాలని చూస్తా – ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాట్ కామెంట్స్..
- తూర్పు గోదావరి

భరత్ నీలా సూట్ కేసులు గురించి ఆలోచించను కార్మికులు బాగుండాలని చూస్తా – ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు హాట్ కామెంట్స్..

గడిచిన ఆరు సంవత్సరాలుగా పేపరుమిల్లు కార్మికుల నిరీక్షణకు మంచి అగ్రిమెంట్ లభించి, వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ విజయమని గర్వంగా చెబుతున్నామన్నారు. పేపర్ మిల్లు కార్మికులకు నూతన వేతన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పేపర్ మిల్లు యూనియన్ నాయకులు, కార్మికులు మంగళవారం ఉదయం స్థానిక తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని కల్సి ధన్యవాదములు తెలియజేసారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కంటే వారి స్వలాభమే చూసుకున్నారని, ప్యాకేజిపై ఉన్న శ్రద్ధ కార్మికుల వేతన ఒప్పందంపై చూపించలేదని వ్యాఖ్యానించారు. తరచూ కార్మికులు తమకు జరుగుతున్న అన్యాయంపై వివరించినపుడు తెలుగుదేశం పార్టీని, టీఎన్టియుసిని నమ్మాలని, తప్పకుండ తాము అధికారంలోకి వచ్చాక మంచి అగ్రిమెంట్ చేసి, న్యాయం చేస్తామని చెప్పామని ఎమ్మెల్యే వాసు గుర్తుచేసారు. తమపై విశ్వాసం ఉంచి తమను గెలిపించి, వైసిపి వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టారని ఆయన అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, పరంపరంలో నష్టపోయినవారికి న్యాయం చేశామని, కార్మికులకు అన్యాయం చేసినవారిపై కేసులు కట్టించామని ఆయన అన్నారు. ఇంత చేస్తున్నా సరే, ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని, వైసిపి విమర్శలకు జవాబు ఇవ్వకుండా, పనిచేసి చూపించి నోరు మూయించామని ఎమ్మెల్యే వాసు అన్నారు. పర్మినెంట్ కార్మికుల మొదలుకుని కాంట్రాక్ట్ కార్మికుల వరకు అందరికీ న్యాయం జరిగేవిధంగా మంచి అగ్రిమెంట్ చేయించగలిగామని ఎమ్మెల్యే వాసు అన్నారు. తాము చేసిన ప్రయత్నానికి ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, అధికారులు, కూటమి నాయకులు, కార్మికులు అందరూ సహకరించారని అలాగే మేనేజిమెంట్ దిగిరాకపోయేసరికి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పుడు అధికారులతో కమిటీ వేసి సమస్య పరిష్కారం అయ్యేలా చేశామని ఆయన వివరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ 15ఈనెలల కాలంలో పేపరు మిల్లు గేటు దగ్గర ఆందోళనలు జరుగుతుంటే, మాజీ ఎంపీ భరత్ అక్కడకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ‘నీవు సూట్ కేసులు గురించి ఆలోచించావు .. నేను కార్మికుల బాగుండాలని చూసా. కార్మికులకు ఏమిచేయాలో తెలుసుకు కాబట్టే నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. కూటమిని గెలిపించారు… నీ అసమర్ధత వలన అగ్రిమెంట్ చేయలేదని ఒప్పుకోవాలి’ అని భరత్ నుద్దేశించి ఎమ్మెల్యే వాసు వ్యాఖ్యానించారు. ఆఖరికి అగ్రిమెంట్ అవుతుంటే, వైసిపి వాళ్ళు మోకాలడ్డారని ఆయన విమర్శించారు. నేను లేని రాజమహేంద్రవరం ఏమైపోతుందోనని భరత్ ఊహించుకున్నప్పటికీ ఇప్పుడు రాజమహేంద్రవరం చాలా బాగుందని ఆయన చురకలంటించారు. మిల్లులో 4000మంది కార్మికులుంటే అందులో తన ఓటర్లు ఎంతమంది ఉంటారన్నది భేరీజు వేసుకుకోండా అందరికీ న్యాయం చేయాలని చూశానని ఎమ్మెల్య్ వాసు అన్నారు. అగ్రిమెంట్ ఆలస్యం కారణంగా కార్మికులు కడుపుమంటతో కేకలు వేస్తుంటే, నిస్సహాయతకు మదన పడ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. మొత్తానికి బాగా నలిగిపోయినప్పటికీ కార్మికులందరికీ న్యాయం చేయగలిగామన్నారు. కోట్లు దోచుకున్నవాళ్ళు వాళ్లకి ఇచ్చాం, వీళ్లకు ఇచ్చాం అంటూ నిస్సిగ్గుగా తప్పు ఒప్పుకోకుండా తిరుగుతున్నారని, అయితే అన్నిరోజులు ఒకలా ఉండవని ఆయన అన్నారు. యాజమాన్యం మొండి వైఖరితో ఉన్నప్పటికీ కార్మికులే తమకు ముఖ్యమని వ్యవహరించామని, అదేవిధంగా పరిశ్రమలు ఉండాలని ఆలోచన చేశామని, ఎక్కడా ప్యాకేజి కోసం చూడలేదని ఎమ్మెల్యే వాసు స్పషం చేసారు. కార్మికులకు అన్నివేళలా మా కుటుంబం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు. ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెల్పిన కార్మిక నాయకులు… కార్మిక నాయకులు మాట్లాడుతూ 5సంవత్సరాలకు పైగా ఎన్నికలు, అగ్రిమెంట్ లేకపోవడంతో కూటమి ప్రభుత్వ దృష్టికి తెచ్చామని ఎమ్మెల్యే వాసు ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో జరిగిన అగ్రిమెంట్ లో కార్మికులకు 5800జీతం, కాంట్రాక్ట్ కార్మికులకు 55రూపాయలు జీతం పెంచారని తెలిపారు. ఎన్నాళ్ళనుంచో చూస్తున్న అగ్రిమెంట్ చేసి 4000కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపినందుకు కూటమి ప్రభుత్వానికి కార్మికుల తరపున ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్లుగా కార్మికులు చాలా బాధలు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చి న్యాయం చేసిందని, ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నాయకత్వంలో ముందుండి నడిపించడం వలన మంచి అగ్రిమెంట్ చేసుకోగలిగామని అన్నారు. ఏలూరులో కాపీ ఇచ్చారని, 11యూనియన్లు సంతకాలు పెట్టాయని తెలిపారు. మీడియా సమావేశంలో టిడిపి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, ఉప్పులూరి జానకి రామయ్య, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, దుత్తరపు గంగాధర్, అధిక సంఖ్యలో పేపర్ మిల్లు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

గడిచిన ఆరు సంవత్సరాలుగా పేపరుమిల్లు కార్మికుల నిరీక్షణకు మంచి అగ్రిమెంట్ లభించి, వారి జీవితాల్లో వెలుగులు వచ్చాయని రాజమహేంద్రవరం నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ (వాసు) అన్నారు. ఇది కూటమి ప్రభుత్వ విజయమని గర్వంగా చెబుతున్నామన్నారు. పేపర్ మిల్లు కార్మికులకు నూతన వేతన ఒప్పందం కుదిరిన నేపథ్యంలో పేపర్ మిల్లు యూనియన్ నాయకులు, కార్మికులు మంగళవారం ఉదయం స్థానిక తిలక్ రోడ్డులోని ఎమ్మెల్యే కార్యాలయంలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ని కల్సి ధన్యవాదములు తెలియజేసారు. ఈసందర్బంగా ఎమ్మెల్యే వాసు మాట్లాడుతూ గత వైసిపి ప్రభుత్వం కార్మికుల శ్రేయస్సు కంటే వారి స్వలాభమే చూసుకున్నారని, ప్యాకేజిపై ఉన్న శ్రద్ధ కార్మికుల వేతన ఒప్పందంపై చూపించలేదని వ్యాఖ్యానించారు.

తరచూ కార్మికులు తమకు జరుగుతున్న అన్యాయంపై వివరించినపుడు తెలుగుదేశం పార్టీని, టీఎన్టియుసిని నమ్మాలని, తప్పకుండ తాము అధికారంలోకి వచ్చాక మంచి అగ్రిమెంట్ చేసి, న్యాయం చేస్తామని చెప్పామని ఎమ్మెల్యే వాసు గుర్తుచేసారు. తమపై విశ్వాసం ఉంచి తమను గెలిపించి, వైసిపి వాళ్ళను ఇంట్లో కూర్చోబెట్టారని ఆయన అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కార్మికులకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తున్నామని, పరంపరంలో నష్టపోయినవారికి న్యాయం చేశామని, కార్మికులకు అన్యాయం చేసినవారిపై కేసులు కట్టించామని ఆయన అన్నారు. ఇంత చేస్తున్నా సరే, ఎప్పుడూ గొప్పలు చెప్పుకోలేదని, వైసిపి విమర్శలకు జవాబు ఇవ్వకుండా, పనిచేసి చూపించి నోరు మూయించామని ఎమ్మెల్యే వాసు అన్నారు.

పర్మినెంట్ కార్మికుల మొదలుకుని కాంట్రాక్ట్ కార్మికుల వరకు అందరికీ న్యాయం జరిగేవిధంగా మంచి అగ్రిమెంట్ చేయించగలిగామని ఎమ్మెల్యే వాసు అన్నారు. తాము చేసిన ప్రయత్నానికి ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్, అధికారులు, కూటమి నాయకులు, కార్మికులు అందరూ సహకరించారని అలాగే మేనేజిమెంట్ దిగిరాకపోయేసరికి సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లినప్పుడు అధికారులతో కమిటీ వేసి సమస్య పరిష్కారం అయ్యేలా చేశామని ఆయన వివరించారు. అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. ఈ 15ఈనెలల కాలంలో పేపరు మిల్లు గేటు దగ్గర ఆందోళనలు జరుగుతుంటే, మాజీ ఎంపీ భరత్ అక్కడకు ఎందుకు రాలేదని ఆయన ప్రశ్నించారు. ‘నీవు సూట్ కేసులు గురించి ఆలోచించావు .. నేను కార్మికుల బాగుండాలని చూసా. కార్మికులకు ఏమిచేయాలో తెలుసుకు కాబట్టే నిన్ను ఇంట్లో కూర్చోబెట్టారు. కూటమిని గెలిపించారు… నీ అసమర్ధత వలన అగ్రిమెంట్ చేయలేదని ఒప్పుకోవాలి’ అని భరత్ నుద్దేశించి ఎమ్మెల్యే వాసు వ్యాఖ్యానించారు. ఆఖరికి అగ్రిమెంట్ అవుతుంటే, వైసిపి వాళ్ళు మోకాలడ్డారని ఆయన విమర్శించారు. నేను లేని రాజమహేంద్రవరం ఏమైపోతుందోనని భరత్ ఊహించుకున్నప్పటికీ ఇప్పుడు రాజమహేంద్రవరం చాలా బాగుందని ఆయన చురకలంటించారు.

మిల్లులో 4000మంది కార్మికులుంటే అందులో తన ఓటర్లు ఎంతమంది ఉంటారన్నది భేరీజు వేసుకుకోండా అందరికీ న్యాయం చేయాలని చూశానని ఎమ్మెల్య్ వాసు అన్నారు. అగ్రిమెంట్ ఆలస్యం కారణంగా కార్మికులు కడుపుమంటతో కేకలు వేస్తుంటే, నిస్సహాయతకు మదన పడ్డానని ఆయన గుర్తుచేసుకున్నారు. మొత్తానికి బాగా నలిగిపోయినప్పటికీ కార్మికులందరికీ న్యాయం చేయగలిగామన్నారు. కోట్లు దోచుకున్నవాళ్ళు వాళ్లకి ఇచ్చాం, వీళ్లకు ఇచ్చాం అంటూ నిస్సిగ్గుగా తప్పు ఒప్పుకోకుండా తిరుగుతున్నారని, అయితే అన్నిరోజులు ఒకలా ఉండవని ఆయన అన్నారు. యాజమాన్యం మొండి వైఖరితో ఉన్నప్పటికీ కార్మికులే తమకు ముఖ్యమని వ్యవహరించామని, అదేవిధంగా పరిశ్రమలు ఉండాలని ఆలోచన చేశామని, ఎక్కడా ప్యాకేజి కోసం చూడలేదని ఎమ్మెల్యే వాసు స్పషం చేసారు. కార్మికులకు అన్నివేళలా మా కుటుంబం అండగా ఉంటుందని పునరుద్ఘాటించారు.

ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెల్పిన కార్మిక నాయకులు…
కార్మిక నాయకులు మాట్లాడుతూ 5సంవత్సరాలకు పైగా ఎన్నికలు, అగ్రిమెంట్ లేకపోవడంతో కూటమి ప్రభుత్వ దృష్టికి తెచ్చామని ఎమ్మెల్యే వాసు ఎంపీ పురందేశ్వరి, మంత్రి కందుల దుర్గేష్ తదితరులు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు. విజయవాడలో జరిగిన అగ్రిమెంట్ లో కార్మికులకు 5800జీతం, కాంట్రాక్ట్ కార్మికులకు 55రూపాయలు జీతం పెంచారని తెలిపారు. ఎన్నాళ్ళనుంచో చూస్తున్న అగ్రిమెంట్ చేసి 4000కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపినందుకు కూటమి ప్రభుత్వానికి కార్మికుల తరపున ధన్యవాదాలు తెలిపారు. గత ఐదేళ్లుగా కార్మికులు చాలా బాధలు పడ్డారని, కూటమి ప్రభుత్వం వచ్చి న్యాయం చేసిందని, ముఖ్యంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు నాయకత్వంలో ముందుండి నడిపించడం వలన మంచి అగ్రిమెంట్ చేసుకోగలిగామని అన్నారు. ఏలూరులో కాపీ ఇచ్చారని, 11యూనియన్లు సంతకాలు పెట్టాయని తెలిపారు. మీడియా సమావేశంలో టిడిపి నాయకులు కాశీ నవీన్ కుమార్, మజ్జి రాంబాబు, వర్రే శ్రీనివాసరావు, నక్కా చిట్టిబాబు, ఉప్పులూరి జానకి రామయ్య, కొయ్యల రమణ, బుడ్డిగ రవి, దుత్తరపు గంగాధర్, అధిక సంఖ్యలో పేపర్ మిల్లు నాయకులు, కార్మికులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.