Tuesday, 24 March 2026
  • Home  
  • భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ
- డా. బిఆర్ అంబేద్కర్ కోనసీమ

భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. రెండో ప్రమాద హెచ్చరిక జారీ

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @గోదావరి ఉగ్రరూపం: ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం ఉదయం 9 గంటలకు గోదావరి ప్రవాహం 48 అడుగులు దాటింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగాయి. కల్యాణ కట్ట వరకు వరద నీరు చేరింది. నీటిమట్టం పెరగడంతో భక్తులు స్నానాలు చేయడానికి నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తూరుబాక వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదతో వీఆరపురం, కూనవరం, చింతూరు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

ఆగస్టు 31 పున్నమి ప్రతినిధి @గోదావరి ఉగ్రరూపం:
ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదతో భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం దాల్చింది. ఆదివారం ఉదయం 9 గంటలకు గోదావరి ప్రవాహం 48 అడుగులు దాటింది. దీంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. స్నాన ఘట్టాల ప్రాంతం వద్ద చాలా మెట్లు, విద్యుత్ స్తంభాలు నీటిలో మునిగాయి. కల్యాణ కట్ట వరకు వరద నీరు చేరింది. నీటిమట్టం పెరగడంతో భక్తులు స్నానాలు చేయడానికి నదిలోకి వెళ్లొద్దని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. తూరుబాక వద్ద ప్రధాన రహదారిపై వరద నీరు చేరడంతో దుమ్ముగూడెం, చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గోదావరి వరదతో వీఆరపురం, కూనవరం, చింతూరు మండలాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.