నెల్లూరు , నవంబర్ (పున్నమి ప్రతినిధి)
ఢిల్లీ దాడుల నేపథ్యంలో నెల్లూరు జిల్లాలో ఏవైనా అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టినట్లు జిల్లా యస్.పి. డా. అజిత్ వేజెండ్ల తెలిపారు. యస్.పి. ఆదేశాల మేరకు అన్ని స్టేషన్ల పరిధిలో బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్లు, పబ్లిక్ ప్రదేశాల్లో పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
తెలియని వ్యక్తులిచ్చే బ్యాగులు, కవర్లు స్వీకరించవద్దని, ఏదైనా అనుమానం ఉన్నా ఆందోళన చెందకుండా వెంటనే పోలీసులను సంప్రదించాలని సూచించారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటే భద్రత మరింత బలపడుతుందని యస్.పి. గారు వెల్లడించారు.
అనుమానాస్పద వ్యక్తులు, వాహనాలు, వస్తువులు గమనించిన వెంటనే 112 లేదా స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.


