జన్నారం వాగు ప్రమాద స్థలాన్ని పరిశీలించిన అధికారులు
భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశాలు
ఏన్కూరు : అంజనాపురం వాగులో డీసీఎం వాహనం కొట్టుకుపోయిన ఘటనపై అధికారులు స్పందించారు. బుధవారం రాత్రి ఏసీపీ, సీఐ, ఏన్కూరు ఎస్ఐ సంధ్య సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిస్థితులను స్వయంగా పరిశీలించారు.వాగు నీటి ప్రవాహం, రహదారి పరిస్థితి, వాహనం కొట్టుకుపోయిన ప్రదేశం వంటి అంశాలను అధికారులు నిశితంగా పరిశీలించారు. ప్రమాదానికి దారితీసిన కారణాలను తెలుసుకునేందుకు స్థానికులు మరియు సంబంధిత అధికారుల నుండి వివరాలు సేకరించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగకుండా తగిన భద్రతా చర్యలు తీసుకోవాలి. వాగు వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయడం, రోడ్డు మరమ్మతులు చేయడం, డ్రైవర్లకు జాగ్రత్త సూచనలు ఇవ్వడం వంటి చర్యలను తక్షణమే అమలు చేయాలి అని సూచించారు.వర్షాకాలంలో ప్రజలు రాకపోకల ఇబ్బందులు పడకూడదని, భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని అన్నారు.
స్థానిక ప్రజలు అధికారులు వెంటనే స్పందించి సంఘటనా స్థలాన్ని పరిశీలించడాన్ని స్వాగతించారు.ఇకనైనా ఈ వాగు వద్ద శాశ్వత పరిష్కారం తీసుకురావాలని, రహదారి మరమ్మతులు, భద్రతా బోర్డులు ఏర్పాటు చేయాలని” వారు కోరారు.ప్రతి సంవత్సరం ఇలాగే ప్రమాదాలు జరుగుతున్నాయి. అధికారులు పరిశీలించి చర్యలు ప్రారంభించడమే సరైన దిశలో మొదటి అడుగు అని గ్రామస్థులు తెలిపారు.


