పున్నమి ప్రతినిధి హన్మకొండ సెప్టెంబర్:
దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి కడియం కావ్య, వరంగల్ పశ్చిమ శాసన సభ్యులు నాయిని నీలిమ రాజేందర్ రెడ్డి మరియు అల్లుడు విష్ణు వర్ధన్ రెడ్డి కుటుంబ సమేతంగా భద్రకాళి అమ్మవారి, వేలి స్తంభాల రుద్రేశ్వర స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. జ్యోతి వెలిగించి నవరాత్రి ఉత్సవాలను అధికారికంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి, దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం ఘనంగా చేపట్టారు. భక్తులు సౌకర్యం పొందేలా ఏర్పాట్లు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ఉచిత విద్యుత్తు అందిస్తున్నదని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రతినిధులు, భక్తులు, నాయకులు ఘనంగా పాల్గొన్నారు.


