శ్రీ సత్య సాయి సేవా సంస్థలు
ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి *విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
*భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శతజయంతి వేడుకల సందర్భంగా రాజీవ్‌నగర్ శ్రీ సత్య సాయి భజన మండలి లో పరిమళించిన సేవా ఆధ్యాత్మిక కార్యక్రమాలు*
భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి శత వర్ష జన్మ దినోత్సవ వేడుకల్లో భాగంగా, 2024 సంవత్సరం డిసెంబర్ నేలనుండి ప్రతి నెలా 23 వ తేదీన విశాఖ జిల్లా శ్రీ సత్య సాయి సేవా సంస్థల సేవా విభాగం విశాఖ జిల్లా లోని ప్రతి సత్య సాయి సమితి అందు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
అందులో భాగంగా ఈ రోజు ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితికి చెందిన రాజీవ్‌నగర్ శ్రీ సత్య సాయి భజన మండలి ద్వారా రాజీవ్ నగర్ శివాలయం అందు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి జన్మదిన వేడుకలను శ్రీ సత్య సాయి సేవా సంస్థల సేవా విభాగం (పురుష మరియు మహిళా) సమన్వయకర్తలు శ్రీ ఆర్.ఏ.నాయుడు & శ్రీమతి కె.ఈశ్వరి సమన్వయపరిచారు.
ముందుగా ఉదయం విశాఖ జిల్లా వేదం బృందం శ్రీ సుబ్రహ్మణ్యం గారి మార్గదర్శకతలో రుద్రపారాయణం చేశారు. అనంతరం ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి భక్తులచే విశ్వ మానవ కళ్యాణం, విశ్వ శాంతి కోసం నామసంకీర్తన జరిగింది.
అనంతరం శ్రీ సత్య సాయి సేవా సంస్థల విశాఖ జిల్లా అధ్యక్షులు శ్రీ పి.ఆర్.ఎస్.ఎన్. నాయుడు సేవా కార్యక్రమాల లో భాగంగా కొత్త బట్టలు ( చీర, దుప్పటి, లుంగీ సెట్ ), భోజన ప్యాకెట్లు, మజ్జిగ లను యాతపాలెం, రాసలమ్మ కాలనీ, దువ్వాడ, రాజీవ్ నగర్ కు చెందిన 216 పేద కుటుంబాలకు ప్రేమతో అంద చేశారు. అనంతరం నారాయణ సేవ ద్వారా 300 మందికి భోజన ప్రసాదం అందచేశారు.
ఈ కార్యక్రమం లో జిల్లా పదాధికారుల శ్రీమతి సోమేశ్వరి, శ్రీమతి అపర్ణ, శ్రీ సత్య సాయి సేవా సమితి-విశాఖ సిటీ కన్వీనర్ శ్రీ సాయి కుమార్, ఉక్కునగరం శ్రీ సత్య సాయి సేవా సమితి కన్వీనర్ శ్రీ జి. రామకృష్ణ, శ్రీ కె.వి.ఎస్. జోగారావు, శ్రీ ఎ.వి. శ్రీనివాస్, శ్రీ జి.వి. ప్రసాద్ తదితరులు,సేవాదళ సభ్యులు, భక్తులు మరియు యువత పాల్గొన్నారు.
ప్రతీ నెలా నిర్వహించే ఈ కార్యక్రమాలు భగవాన్ శ్రీ సత్య సాయి బాబా వారి దివ్య సందేశమైన “ప్రేమ – సేవ – ఐక్యత”భావాన్ని మరింత విస్తరింపజేసి, నవంబర్ 2025 శత వర్ష జన్మదిన మహోత్సవానికి మార్గదర్శకంగా నిలుస్తాయి.


