రాష్ట్ర స్థాయి భగవద్గీత పోటీలో శ్రీ అన్నమాచార్య అకాడమీ విద్యార్థిని ఓ. హారికా రెడ్డి జోనల్ విజేతగా నిలిచి పాఠశాల పేరు ప్రఖ్యాతులు చాటింది.
శివ దర్శనానంద స్పిర్చువల్ ట్రస్ట్, ప్రొద్దుటూరు నిర్వహించిన ఈ పోటీలో దాదాపు 150 మంది విద్యార్థులు ప్రతిభను ఆవిష్కరించగా,హారికా రెడ్డి అత్యుత్తమ ప్రతిభతో తొలి స్థానాన్ని దక్కించుకుంది.
హారికా విజయంపై పాఠశాల కరస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ స్పందిస్తూ మా సంస్థ విద్యా ప్రమాణాలకు ఇది నిదర్శనం.హారికా రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలనే ఆకాంక్ష ఉంది అని అభినందనలు తెలిపారు.
డైరెక్టర్లు మాడపూరి హేమలత, బాల ఆంజనేయులు,సమ్మెట ఉమామహేశ్వరరావు, రిటైర్డ్ ఎల్ఐసి ఏవో మాడపూరి సుబ్బరాయుడు, ఉపాధ్యాయురాలు లలితతో పాటు అధ్యాపక వర్గం ఈ విజయాన్ని సంతోషంగా జరుపుకున్నారు.విజేతను కరస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు.

భగవద్గీత పోటీలో జోనల్ విజేతగా మెరిసిన శ్రీ అన్నమాచార్య విద్యార్థిని హారికా రెడ్డి
రాష్ట్ర స్థాయి భగవద్గీత పోటీలో శ్రీ అన్నమాచార్య అకాడమీ విద్యార్థిని ఓ. హారికా రెడ్డి జోనల్ విజేతగా నిలిచి పాఠశాల పేరు ప్రఖ్యాతులు చాటింది. శివ దర్శనానంద స్పిర్చువల్ ట్రస్ట్, ప్రొద్దుటూరు నిర్వహించిన ఈ పోటీలో దాదాపు 150 మంది విద్యార్థులు ప్రతిభను ఆవిష్కరించగా,హారికా రెడ్డి అత్యుత్తమ ప్రతిభతో తొలి స్థానాన్ని దక్కించుకుంది. హారికా విజయంపై పాఠశాల కరస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ స్పందిస్తూ మా సంస్థ విద్యా ప్రమాణాలకు ఇది నిదర్శనం.హారికా రెడ్డి భవిష్యత్తులో మరిన్ని ఉన్నత విజయాలు సాధించాలనే ఆకాంక్ష ఉంది అని అభినందనలు తెలిపారు. డైరెక్టర్లు మాడపూరి హేమలత, బాల ఆంజనేయులు,సమ్మెట ఉమామహేశ్వరరావు, రిటైర్డ్ ఎల్ఐసి ఏవో మాడపూరి సుబ్బరాయుడు, ఉపాధ్యాయురాలు లలితతో పాటు అధ్యాపక వర్గం ఈ విజయాన్ని సంతోషంగా జరుపుకున్నారు.విజేతను కరస్పాండెంట్ సమ్మెట శివప్రసాద్ ప్రత్యేకంగా అభినందించారు.

