డాక్టర్ బి ఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆత్రేయపురం మండలం వాడపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం కు సోమవారం భక్తులు పోటెత్తారు.ఇప్పటికే కోనసీమ తిరుమల గా పేరు గాంచిన వాడపల్లి వెంకన్న ఆలయానికి రోజు రోజు భక్తుల తాకిడి ఎక్కువ అవుతుండడంతో ఆలయ అధికారులు డీసీ సూర్య చక్రధర్ భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా చర్యలు తీసుకున్నారు.ఏడు వారాలు ఏడు జన్మల పుణ్యఫలం అని విశ్వాసంతో భక్తులు స్వామి వారిని దర్శించుకోవడం జరుగుతుంది.