శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్ భారీ విరాళంతో ముందుకొచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆయన లక్ష (1,00,000) మంచినీటి బాటిళ్లను ఈ మంచినీటి బాటిళ్లను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్కి అజయ్ విరాళంగా అందజేశారు.
దాతలసేవలుఅభినందనీయం-ఆలయచైర్మన్: ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంత భారీ స్థాయిలో భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పించిన అజయ్ ని, జనసేన నాయకులను మనస్ఫూర్తిగా అభినందించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ఇలాంటి దాతల సహకారం మరింత స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని భక్తులు, స్థానికులు కొనియాడారు.

భక్తుల సేవలో జనసేన- లక్ష నీటి బాటిళ్లను అందజేసిన క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్
శ్రీకాళహస్తి పున్నమి టెంపుల్ న్యూస్, ఫిబ్రవరి 13: శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలకు తరలివచ్చే లక్షలాది మంది భక్తుల సౌకర్యార్థం జనసేన పార్టీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ అజయ్ భారీ విరాళంతో ముందుకొచ్చారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల దాహార్తిని తీర్చేందుకు ఆయన లక్ష (1,00,000) మంచినీటి బాటిళ్లను ఈ మంచినీటి బాటిళ్లను శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్కి అజయ్ విరాళంగా అందజేశారు. దాతలసేవలుఅభినందనీయం-ఆలయచైర్మన్: ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్ మాట్లాడుతూ.. ఇంత భారీ స్థాయిలో భక్తుల కోసం మంచినీటి సౌకర్యం కల్పించిన అజయ్ ని, జనసేన నాయకులను మనస్ఫూర్తిగా అభినందించారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రభుత్వం, దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేస్తోందని, ఇలాంటి దాతల సహకారం మరింత స్ఫూర్తిదాయకమని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు, ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. జనసేన పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సేవా కార్యక్రమాన్ని భక్తులు, స్థానికులు కొనియాడారు.

