ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 10 (మల్లికార్జున రావు పున్నమి ప్రతినిధి)
మనుబోలులో గురువారం రాత్రి సూలప్ప పయనంతో శ్రీ కామాక్షితాయిసమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు సాయి కుమార్ శర్మ, ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు సూలప్పను భుజాలపై మోసుకొని బద్దెవోలు క్రాస్ రోడ్లోని ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ధ్వజారోహణ నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం ఉగాది అనంతరం పాడి పంటలు చేతికి వచ్చిన సమయంలో ఏప్రిల్ 9 నుంచి 17 వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

భక్తి శ్రద్ధల మధ్య సూలప్ప పయనం… సంగమేశ్వర బ్రహ్మోత్సవాలకు శ్రీకారం
ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఏప్రిల్ 10 (మల్లికార్జున రావు పున్నమి ప్రతినిధి) మనుబోలులో గురువారం రాత్రి సూలప్ప పయనంతో శ్రీ కామాక్షితాయిసమేత సంగమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. అర్చకులు సాయి కుమార్ శర్మ, ఫణీంద్ర శర్మ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులు సూలప్పను భుజాలపై మోసుకొని బద్దెవోలు క్రాస్ రోడ్లోని ఆలయానికి తీసుకెళ్లారు. అక్కడ ధ్వజారోహణ నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం ఉగాది అనంతరం పాడి పంటలు చేతికి వచ్చిన సమయంలో ఏప్రిల్ 9 నుంచి 17 వరకు ఈ బ్రహ్మోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీగా కొనసాగుతోంది.

