*విశాఖపట్నం అక్టోబర్ పున్నమి ప్రతినిధి*
బ్లింకిట్ బ్యాగ్‌లో గంజాయి రవాణా – ఇద్దరు వ్యక్తుల అరెస్ట్
తేదీ 25-10-2025 ఉదయం సుమారు 09:30 గంటల సమయంలో, పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్‌కు చెందిన WSI శ్రీమతి ఎన్. సునీత గారికి విశ్వసనీయ సమాచారం అందడంతో, సిబ్బందితో కలిసి కమ్మాది ప్రాంతంలో దాడి చేశారు.
దాడి సమయంలో ఇద్దరు వ్యక్తులు బ్లింకిట్ డెలివరీ బ్యాగ్‌లో గంజాయి తీసుకెళ్తూ ఉన్నట్లు గుర్తించబడగా, వారిని వెంటాడి పట్టుకున్నారు.
విచారణలో వారిని నల్లబిల్లి గణేష్ (32 సంవ.) మరియు హోరో సంజయ్‌కుమార్ (29 సంవ.) గా గుర్తించారు. వీరి వద్ద నుండి మొత్తం 2 కిలోల గంజాయి స్వాధీనం చేసి, క్రైమ్ నెం. 622/2025 U/s 20(b)(ii) NDPS యాక్ట్ 1985 r/w 187 BNSS 2023 కింద కేసు నమోదు చేశారు.
అరెస్టు చేసిన నిందితులను కోర్టులో హాజరుపరచి రిమాండ్‌కు పంపించారు.
ఈ కేసు దర్యాప్తు సబ్-ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ కే. భాస్కరరావు గారి పర్యవేక్షణలో జరుగుతోంది.
ఇన్‌స్పెక్టర్ ఆఫ్ పోలీస్ శ్రీ జి. బాలకృష్ణ గారి సూచనలు:
ఇలాంటి నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్ (గంజాయి) అక్రమ రవాణా, నిల్వ, విక్రయం చేసే వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
సామాన్య ప్రజలు తమ పరిసరాల్లో గంజాయి అక్రమ రవాణా లేదా వినియోగంపై సమాచారం ఉంటే వెంటనే పి.ఎం. పాలెం పోలీస్ స్టేషన్ (ఫోన్: 9440796060) కు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు.


