బ్లడ్ బ్యాంక్ కాలనీలో విద్యుత్ సమస్యకు చెక్ – నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేసిన కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి
పున్నమి న్యూస్ ప్రతినిధి
హయత్ నగర్ డివిజన్
03 ఫిబ్రవరి 2026
హయత్ నగర్ డివిజన్లోని బ్లడ్ బ్యాంక్ కాలనీలో గత కొంతకాలంగా లో వోల్టేజ్ సమస్య తీవ్రంగా ఉండటంతో గృహాలలోని ఎలక్ట్రానిక్ పరికరాలు దెబ్బతినడం, ఫ్యాన్లు, మోటార్లు సరిగా పనిచేయక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ సమస్యను స్థానికులు కార్పొరేటర్ కళ్లెం నవజీవన్ రెడ్డి దృష్టికి తీసుకురాగా ఆయన వెంటనే స్పందించారు.
విద్యుత్ శాఖ అధికారులతో కలిసి కాలనీలో పర్యటించి పరిస్థితిని పరిశీలించిన కార్పొరేటర్ గారు శాశ్వత పరిష్కారంగా నూతన ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేయించారు. దీంతో కాలనీలో విద్యుత్ సరఫరా మెరుగుపడి వోల్టేజ్ సమస్య పూర్తిగా తగ్గింది.
ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ, ప్రజల సమస్యల పరిష్కారం తమ బాధ్యత అని, ప్రతి కాలనీలో మెరుగైన మౌలిక సదుపాయాలు అందించే దిశగా కృషి కొనసాగుతుందని తెలిపారు. కాలనీవాసులు హర్షం వ్యక్తం చేస్తూ కార్పొరేటర్ కి ధన్యవాదాలు తెలిపారు.
ఈ కార్యక్రమం లో AE ఖాదర్ అలీ, లైన్ మ్యాన్ అశోక్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి
బండారి భాస్కర్, బీజేవైఎం అధ్యక్షులు అఖిలేష్ మరియు కాలనీవాసులు తదితరులు పాల్గొన్నారు…
*కార్పొరేటర్ గారి కార్యాలయం.*
హయత్ నగర్ డివిజన్



