Monday, 8 December 2025
  • Home  
  • బ్రెజిల్ ప్రతినిధుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కొవ్వూరు డివిజన్ లో పర్యటన.
- తూర్పు గోదావరి

బ్రెజిల్ ప్రతినిధుల ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా కొవ్వూరు డివిజన్ లో పర్యటన.

ప్రకృతి వ్యవసాయం, వినూత్న పద్ధతులు మరియు రైతు సాధికారతపై ప్రత్యక్ష అనుభవాలు. ప్రకృతి వ్యవసాయం, వినూత్న పద్ధతులు మరియు రైతు సాధికారతపై ప్రత్యక్ష అనుభవాల కోసం బ్రెజిల్, యు.ఏ.ఈ., మరియు శ్రీలంకకు చెందిన 30 మంది ప్రతిష్టాత్మక నిపుణుల బృందం ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు. ఈ పర్యటనను రైతు సాధికార సంస్థ (RySS) మరియు నౌ భాగస్వాములు (NOW – Partners) సంయుక్తంగా నిర్వహించారు. నౌ సంస్థ స్థిరమైన మరియు పునరుత్పత్తి వ్యవస్థలను సాధించడానికి కంపెనీలకు మద్దతుగా పనిచేసే వ్యాపారవేత్తల మరియు నిపుణుల గ్లోబల్ అలయన్స్. ఈ సంస్థను జర్మనీకి చెందిన అంతర్జాతీయ వ్యాపారవేత్త వాల్టర్ లింక్ స్థాపించగా, ఆయన ప్రస్తుతం స్థాపక CEOగా కొనసాగుతున్నారు. ఆయన స్వయంగా ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్ర పర్యటనల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రధాన బృంద సభ్యులు, బ్రెజిల్ మంత్రిత్వ శాఖకు చెందిన వివియన్, సాండ్రో కూడా పాల్గొన్నారు. పర్యటనలో భాగంగా ప్రతినిధుల బృందాన్ని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ బృందాలు తూర్పు గోదావరి జిల్లాలోని ముక్కమాల మరియు కాపవరం గ్రామాలను సందర్శించి, రైతు సాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF)” వినూత్న నమూనాలు మరియు సామూహిక ఆధారిత విధానాలను పరిశీలించారు. *మొదటి బృందం పెరవలి మండలం,* ముక్కమాల గ్రామంలో రైతులు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించింది. బృంద సభ్యులు అన్నపూర్ణ నాన్ పెస్టిసైడల్ మేనేజ్మెంట్ (NPM) షాప్ వద్ద ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాల చక్రాన్ని సందర్శించారు. అనంతరం ఘన జీవామృతం, కోడిగుడ్డు–నిమ్మరసం ద్రావణం తయారీ విధానం, వినియోగం మరియు నిల్వ పద్ధతులపై అవగాహన పొందారు. అలాగే శ్రీ జి. వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న డ్రం సీడర్‌తో వరి సాగును వీక్షించి, కలుపు నియంత్రణ, కూలీ ఖర్చు తగ్గింపు మరియు సమయపాలన వంటి ప్రయోజనాలపై చర్చించారు. వేసవిలో 30 రకాల విత్తనాలతో చేసిన పీ.ఎం.డి.ఎస్ పద్ధతి ద్వారా తక్కువ నీటి వినియోగం సాధ్యమవుతుందనే విషయాన్ని తెలుసుకున్నారు. డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా ప్రకృతి ద్రావణాల సమర్థవంతమైన వినియోగం, అలాగే బ్రిక్స్ రీడింగ్ ద్వారా పంట ఆరోగ్యం కొలిచే పద్ధతులను వీక్షించారు. అనంతరం శ్రీ పి. రామకృష్ణ నిర్వహిస్తున్న పామ్ ఆయిల్, వక్క, అరటి సాగు నమూనాలను పరిశీలించి, ఉత్పత్తులకు ఉన్న మార్కెట్ డిమాండ్ గురించి తెలుసుకున్నారు. *రెండవ బృందం కొవ్వూరు మండలం,* కాపవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాల చక్రం మరియు వాటి అమలును పరిశీలించింది. రైతులు క్షేత్ర స్థాయిలో ఆ సూత్రాలను పాటించడం వల్ల వచ్చిన మార్పులు, ఫలితాలు గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. దేశీ విత్తనాల పాత్ర, గట్టు విస్తరణ ద్వారా రైతులు పంట వైవిధ్యం పెంచి అదనపు ఆదాయం పొందుతున్న విధానం ప్రతినిధులను ఆకట్టుకుంది. డ్రోన్‌లను వినియోగించి ఎకరానికి కేవలం 12 లీటర్ల ఇన్పుట్లతో రోజుకు 30–40 ఎకరాలకు స్ప్రే చేయగల సాంకేతికతను పరిశీలించారు. రైతులు ప్రధాన పంటలతో పాటు అంతర పంటలను సమీకరించి పెట్టుబడిపై మూడు రెట్లు ఆదాయం పొందుతున్న నమూనాను వారు ప్రశంసించారు. తదుపరి శ్రీ సత్యనారాయణ నిర్వహిస్తున్న 13 ఎకరాల హార్టికల్చర్ పాలీక్రాపింగ్ క్షేత్రాన్ని ప్రతినిధులు సందర్శించారు. అక్కడ ప్రకృతి వ్యవసాయ సూత్రాలను క్రమంగా అనుసరించడం, సౌరశక్తి వినియోగం ద్వారా చీడపీడల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను ప్రయోగించడం, మరియు పంట వైవిధ్యంతో సస్యశ్యామలంగా కనిపిస్తున్న పొలం అడవిని తలపిస్తోందని బృందం ప్రశంసలు తెలిపింది. సైన్స్ అండ్ అకాడమీ థీమాటిక్ లీడ్ సుధాకర్ నేతృత్వంలో ప్రతినిధులు రైతు శాస్త్రవేత్తలతో పంట ఆరోగ్యం, నేల ఆరోగ్యం, చీడపీడల నియంత్రణ, పంట వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. బ్రిక్స్ మరియు రిఫ్రాక్టోమీటర్ ద్వారా మొక్కల ఆరోగ్యం, పోషకాలను తెలుసుకునే విధానాన్ని పరిశీలించారు. తదుపరి ప్రతినిధులు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై, ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించడంలో వారు పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసించారు. అనంతరం ధర్మవరం గ్రామంలో పి. గోపాలకృష్ణ యొక్క “ఎనీ టైమ్ మనీ” నమూనా మరియు ఆకుల వీర మణికంఠ నిర్వహిస్తున్న డ్రం సీడర్ వరి సాగును సందర్శించారు. బ్రెజిల్ ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం పునరుద్ధరణ, రైతుల సాధికారత మరియు ఆధునిక సాంకేతికతల సమన్వయంపై ప్రత్యక్ష అనుభవాలు పొందారు. ఈ నమూనాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగే మోడళ్లుగా బృందం అభినందించింది. ఈ పర్యటన విజయవంతం కావడానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సుధాకర్, జాకీర్, స్వాతి, హుమయున్, ప్రకాష్, హేమ సుందర్, మధుమోహన్ (అగ్రికల్చర్ ఆఫీసర్), నాగ ప్రమీల రాణి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు, జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు, ఉప వ్యవసాయ సంచాలకుడు శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి గంగాధర్ రావు మరియు ఇతర క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

ప్రకృతి వ్యవసాయం, వినూత్న పద్ధతులు మరియు రైతు సాధికారతపై ప్రత్యక్ష అనుభవాలు.
ప్రకృతి వ్యవసాయం, వినూత్న పద్ధతులు మరియు రైతు సాధికారతపై ప్రత్యక్ష అనుభవాల కోసం బ్రెజిల్, యు.ఏ.ఈ., మరియు శ్రీలంకకు చెందిన 30 మంది ప్రతిష్టాత్మక నిపుణుల బృందం ఆంధ్రప్రదేశ్‌ను సందర్శించారు.

ఈ పర్యటనను రైతు సాధికార సంస్థ (RySS) మరియు నౌ భాగస్వాములు (NOW – Partners) సంయుక్తంగా నిర్వహించారు. నౌ సంస్థ స్థిరమైన మరియు పునరుత్పత్తి వ్యవస్థలను సాధించడానికి కంపెనీలకు మద్దతుగా పనిచేసే వ్యాపారవేత్తల మరియు నిపుణుల గ్లోబల్ అలయన్స్. ఈ సంస్థను జర్మనీకి చెందిన అంతర్జాతీయ వ్యాపారవేత్త వాల్టర్ లింక్ స్థాపించగా, ఆయన ప్రస్తుతం స్థాపక CEOగా కొనసాగుతున్నారు. ఆయన స్వయంగా ఈ ప్రకృతి వ్యవసాయ క్షేత్ర పర్యటనల్లో పాల్గొన్నారు. ఆయనతో పాటు ప్రధాన బృంద సభ్యులు, బ్రెజిల్ మంత్రిత్వ శాఖకు చెందిన వివియన్, సాండ్రో కూడా పాల్గొన్నారు.

పర్యటనలో భాగంగా ప్రతినిధుల బృందాన్ని రెండు గ్రూపులుగా విభజించారు. ఈ బృందాలు తూర్పు గోదావరి జిల్లాలోని ముక్కమాల మరియు కాపవరం గ్రామాలను సందర్శించి, రైతు సాధికార సంస్థ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న “ఆంధ్రప్రదేశ్ ప్రజా భాగస్వామ్య ప్రకృతి వ్యవసాయం (APCNF)” వినూత్న నమూనాలు మరియు సామూహిక ఆధారిత విధానాలను పరిశీలించారు.

*మొదటి బృందం పెరవలి మండలం,* ముక్కమాల గ్రామంలో రైతులు అనుసరిస్తున్న ప్రకృతి వ్యవసాయ పద్ధతులను పరిశీలించింది. బృంద సభ్యులు అన్నపూర్ణ నాన్ పెస్టిసైడల్ మేనేజ్మెంట్ (NPM) షాప్ వద్ద ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాల చక్రాన్ని సందర్శించారు. అనంతరం ఘన జీవామృతం, కోడిగుడ్డు–నిమ్మరసం ద్రావణం తయారీ విధానం, వినియోగం మరియు నిల్వ పద్ధతులపై అవగాహన పొందారు. అలాగే శ్రీ జి. వెంకటేశ్వర్లు నిర్వహిస్తున్న డ్రం సీడర్‌తో వరి సాగును వీక్షించి, కలుపు నియంత్రణ, కూలీ ఖర్చు తగ్గింపు మరియు సమయపాలన వంటి ప్రయోజనాలపై చర్చించారు. వేసవిలో 30 రకాల విత్తనాలతో చేసిన పీ.ఎం.డి.ఎస్ పద్ధతి ద్వారా తక్కువ నీటి వినియోగం సాధ్యమవుతుందనే విషయాన్ని తెలుసుకున్నారు. డ్రోన్ స్ప్రేయింగ్ ద్వారా ప్రకృతి ద్రావణాల సమర్థవంతమైన వినియోగం, అలాగే బ్రిక్స్ రీడింగ్ ద్వారా పంట ఆరోగ్యం కొలిచే పద్ధతులను వీక్షించారు. అనంతరం శ్రీ పి. రామకృష్ణ నిర్వహిస్తున్న పామ్ ఆయిల్, వక్క, అరటి సాగు నమూనాలను పరిశీలించి, ఉత్పత్తులకు ఉన్న మార్కెట్ డిమాండ్ గురించి తెలుసుకున్నారు.

*రెండవ బృందం కొవ్వూరు మండలం,* కాపవరం గ్రామంలో ప్రకృతి వ్యవసాయ 9 సార్వత్రిక సూత్రాల చక్రం మరియు వాటి అమలును పరిశీలించింది. రైతులు క్షేత్ర స్థాయిలో ఆ సూత్రాలను పాటించడం వల్ల వచ్చిన మార్పులు, ఫలితాలు గురించి ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. దేశీ విత్తనాల పాత్ర, గట్టు విస్తరణ ద్వారా రైతులు పంట వైవిధ్యం పెంచి అదనపు ఆదాయం పొందుతున్న విధానం ప్రతినిధులను ఆకట్టుకుంది. డ్రోన్‌లను వినియోగించి ఎకరానికి కేవలం 12 లీటర్ల ఇన్పుట్లతో రోజుకు 30–40 ఎకరాలకు స్ప్రే చేయగల సాంకేతికతను పరిశీలించారు. రైతులు ప్రధాన పంటలతో పాటు అంతర పంటలను సమీకరించి పెట్టుబడిపై మూడు రెట్లు ఆదాయం పొందుతున్న నమూనాను వారు ప్రశంసించారు.

తదుపరి శ్రీ సత్యనారాయణ నిర్వహిస్తున్న 13 ఎకరాల హార్టికల్చర్ పాలీక్రాపింగ్ క్షేత్రాన్ని ప్రతినిధులు సందర్శించారు. అక్కడ ప్రకృతి వ్యవసాయ సూత్రాలను క్రమంగా అనుసరించడం, సౌరశక్తి వినియోగం ద్వారా చీడపీడల నియంత్రణలో ఆధునిక సాంకేతికతను ప్రయోగించడం, మరియు పంట వైవిధ్యంతో సస్యశ్యామలంగా కనిపిస్తున్న పొలం అడవిని తలపిస్తోందని బృందం ప్రశంసలు తెలిపింది. సైన్స్ అండ్ అకాడమీ థీమాటిక్ లీడ్ సుధాకర్ నేతృత్వంలో ప్రతినిధులు రైతు శాస్త్రవేత్తలతో పంట ఆరోగ్యం, నేల ఆరోగ్యం, చీడపీడల నియంత్రణ, పంట వ్యర్థాల నిర్వహణ వంటి అంశాలపై చర్చించారు. బ్రిక్స్ మరియు రిఫ్రాక్టోమీటర్ ద్వారా మొక్కల ఆరోగ్యం, పోషకాలను తెలుసుకునే విధానాన్ని పరిశీలించారు.

తదుపరి ప్రతినిధులు స్వయం సహాయక సంఘాల మహిళలతో సమావేశమై, ప్రకృతి వ్యవసాయాన్ని కొనసాగించడంలో వారు పోషిస్తున్న కీలక పాత్రను ప్రశంసించారు. అనంతరం ధర్మవరం గ్రామంలో పి. గోపాలకృష్ణ యొక్క “ఎనీ టైమ్ మనీ” నమూనా మరియు ఆకుల వీర మణికంఠ నిర్వహిస్తున్న డ్రం సీడర్ వరి సాగును సందర్శించారు. బ్రెజిల్ ప్రతినిధులు ప్రకృతి వ్యవసాయం ద్వారా నేల ఆరోగ్యం పునరుద్ధరణ, రైతుల సాధికారత మరియు ఆధునిక సాంకేతికతల సమన్వయంపై ప్రత్యక్ష అనుభవాలు పొందారు. ఈ నమూనాలను ప్రపంచవ్యాప్తంగా విస్తరించగలిగే మోడళ్లుగా బృందం అభినందించింది.

ఈ పర్యటన విజయవంతం కావడానికి ప్రకృతి వ్యవసాయ సిబ్బంది సుధాకర్, జాకీర్, స్వాతి, హుమయున్, ప్రకాష్, హేమ సుందర్, మధుమోహన్ (అగ్రికల్చర్ ఆఫీసర్), నాగ ప్రమీల రాణి, జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ తాతారావు, జిల్లా వ్యవసాయ అధికారి మాధవరావు, ఉప వ్యవసాయ సంచాలకుడు శ్రీనివాస్, మండల వ్యవసాయ అధికారి గంగాధర్ రావు మరియు ఇతర క్షేత్ర స్థాయి సిబ్బంది పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.