
విశాఖపట్నంలో బ్రహ్మకుమారిల ఆధ్వర్యంలో దసరా ఉత్సవాలు ఘనంగా జరిగాయి. జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద రావణ దహనం కార్యక్రమం నిర్వహించారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నగర పోలీస్ కమిషనర్ శంక బ్రత బాక్చి, ముందుగా గాంధీ జయంతి సందర్భంగా గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “విజయ దశమి పర్వదినం అనేది విజయాలకు ప్రతీకగా నిలుస్తుంది. చెడుపై మంచి సాధించిన చారిత్రక పర్వదినమని పురాణ ఇతిహాస కథనాలు చెబుతున్నాయి” అన్నారు.
బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతూ, పాండవులు, శ్రీరాముడు వంటి అనేక దేవతామూర్తులు విజయదశమి రోజున జమ్మి చెట్టు ఆరాధన చేసి అనేక విజయాలను సాధించారని చెప్పారు. మహిషాసురుని వధించి రాక్షస సంహారం చేసిన ఘట్టాన్ని గుర్తు చేసుకుంటూ దేశవ్యాప్తంగా దసరా రోజున రావణ దహనం నిర్వహిస్తున్నామని వివరించారు.

