ఖమ్మం పున్నమి ప్రతినిధి
బీజేపీ తెలంగాణ రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ బోనకల్ మండలం లో పర్యటించారు. స్వగ్రామం అయినా రావినూతల లో ఏర్పాటు చేసిన వినాయక మండపం ని సందర్శించిన గల్లా సత్యనారాయణ ని అక్కడ గ్రామ పెద్దలు సత్కరించారు. అనంతరం OBC మోర్చా బోనకల్ మండల అధ్యక్షులు మరీదు పరశురాం కుమారుడు శివాన్స్ రోడ్డు ప్రమాదంలో స్వల్పంగా గాయపడ్డారని తెలుసుకొని బోనకల్ మండలంలోని సహచర పార్టీ నాయకులతో కలిసి బోనకల్ లోని పరశురాం ఇంటికి వెళ్లి యోగక్షేమాలు అడిగి తెలుసుకొన్నారు. వీరితో పాటు నాగేశ్వరావ్ర్, పటేల్ లు ఉన్నారు. కార్యకర్తలకి
కొద్దిపాటి సమస్య ఉన్న వెంటనే స్పందించే నేత గల్లా సత్య నారాయణ అని ఈ సందర్భముగా కార్యకర్తలు అన్నారు.


