Sunday, 7 December 2025
  • Home  
  • బొప్పాయి విత్తనాలు, నర్సరీలపై ప్రభుత్వ నియంత్రణ చేయాలి! బ్లాక్ మార్కెట్ అరికట్టాలి!! ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్!!
- E-పేపర్

బొప్పాయి విత్తనాలు, నర్సరీలపై ప్రభుత్వ నియంత్రణ చేయాలి! బ్లాక్ మార్కెట్ అరికట్టాలి!! ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్!!

బొప్పాయి విత్తనాలు, నర్సరీలపై ప్రభుత్వ నియంత్రణ చేయాలి! బ్లాక్ మార్కెట్ అరికట్టాలి!! ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్!! అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 0 1( పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం లోని, బొప్పాయి రైతుల సమస్యలపై, కోడూరులో సిఐటియు ఆఫీసులో, శనివారం నాడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు . ముఖ్య అతిథులుగా, ఏపీ రైతు సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కే .ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, బొప్పాయి విత్తనాలు,  ఫ్రూట్ నర్సరీ పై, ప్రభుత్వం జోక్యం చేసుకొని, నియంత్రణ చేయాలని, విత్తనాల కొరత సృష్టించి, అధిక ధరలు అమ్మేందుకు చేస్తున్న బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని,డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలోనూ, ప్రధానంగా, కోడూరు, రాజంపేట, నియోజకవర్గాల్లో బొప్పాయి పంటను విస్తారంగా సాగు చేస్తారని,  ఈ ఏడాది బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర లేక, నష్టపోయిన, ప్రత్యామ్నాయ లేక, తిరిగి రైతులు భవిష్యత్తు ఆశతో విస్తీర్ణం తగ్గించుకొని సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ సందర్భంగా విత్తనాల సరఫరా చేసే డీలర్లు,బొప్పాయి తైవాన్ రెడ్ లేడీ విత్తనాలు దిగుమతి కాలేదని, కృత్రిమ కొరత సృష్టించి, నేరుగా  రైతులకు అందించకుండా,డీలర్లు, ఏజెంట్లు, మొక్కలు అధిక రేట్లకు అమ్ముకునేందుకు నర్సరీలకు, అందిస్తున్నారన్నారు. బొప్పాయి విత్తనాల,  లైసెన్సు డీలర్లు, రైల్వే కోడూరులో, షాపు ఏర్పాటు చేసి,ఇకపైన నేరుగా రైతులకు సరఫరా చేయాలని,  నేరుగా నర్సరీ లకు  అందించకుండా, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, అధిక ధరలకు బ్లాక్లో అమ్మకుండా, ఎమ్మార్పీ రేట్లు అమ్మాలని కోరారు. విత్తనాలు బ్లాక్ మార్కెట్ల అమ్మే డీలర్లపై చర్య తీసుకోవాలన్నారు. నాణ్యమైన బొప్పాయి విత్తనాలను, 25 శాతం సబ్సిడీతో ప్రభుత్వం రైతులకు, హార్టికల్చర్ , అగ్రికల్చర్, రైతు భరోసా కేంద్రాల ద్వారా, అందించాలని  కోరారు . బొప్పాయి విత్తనాలు, మరియు  మొలకలు, నర్సరీలు పైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. బొప్పాయి మొక్కలను కొన్న రైతులకు, నర్సరీల నుండి, రసీదు బిల్లులు ఇప్పించాలని కోరారు. అనంతరము, రైల్వే కోడూరులో, బొప్పాయి మొలకలు పెంచుతున్న, కొన్ని  నర్సరీలను సందర్శించి పరిశీలించారు. అనంతరం, ఆర్టికల్చర్ హెచ్ ఓ, భాస్కర్ గారికి, సమస్యలతో కూడిన వినతి పత్రం, అందించారు. తమ పరిధిలో ఉన్న, నర్సరీలు పైన విచారించి చర్య తీసుకుంటామని, మిగతా విషయాలు, జిల్లా అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని,  హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్. రైతు సంఘ నాయకులు, పంది కాళ్ళ మణి, ఏదోటి ఆదినారాయణ, సుబ్బరాజు, ఈశ్వరయ్య, బాల, అంకయ్య, కేశవులు, సిఐటియు మండల  కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ, జిల్లా ఉపాధ్యక్షులు,  పి. లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

బొప్పాయి విత్తనాలు, నర్సరీలపై ప్రభుత్వ నియంత్రణ చేయాలి!

బ్లాక్ మార్కెట్ అరికట్టాలి!!
ఏపీ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, కే ప్రభాకర్ రెడ్డి డిమాండ్!!

అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నవంబర్ 0 1( పున్నమి న్యూస్ ప్రతినిధి సింగమాల వెంకటేష్ ) రైల్వే కోడూరు నియోజకవర్గం లోని, బొప్పాయి రైతుల సమస్యలపై, కోడూరులో సిఐటియు ఆఫీసులో, శనివారం నాడు, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు . ముఖ్య అతిథులుగా, ఏపీ రైతు సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  కే .ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ, బొప్పాయి విత్తనాలు,  ఫ్రూట్ నర్సరీ పై, ప్రభుత్వం జోక్యం చేసుకొని, నియంత్రణ చేయాలని, విత్తనాల కొరత సృష్టించి, అధిక ధరలు అమ్మేందుకు చేస్తున్న బ్లాక్ మార్కెట్ ను అరికట్టాలని,డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాలోనూ, ప్రధానంగా, కోడూరు, రాజంపేట, నియోజకవర్గాల్లో బొప్పాయి పంటను విస్తారంగా సాగు చేస్తారని,  ఈ ఏడాది బొప్పాయి పంటకు గిట్టుబాటు ధర లేక, నష్టపోయిన, ప్రత్యామ్నాయ లేక, తిరిగి రైతులు భవిష్యత్తు ఆశతో విస్తీర్ణం తగ్గించుకొని సాగుకు సిద్ధమవుతున్నారని, ఈ సందర్భంగా విత్తనాల సరఫరా చేసే డీలర్లు,బొప్పాయి తైవాన్ రెడ్ లేడీ విత్తనాలు దిగుమతి కాలేదని, కృత్రిమ కొరత సృష్టించి, నేరుగా  రైతులకు అందించకుండా,డీలర్లు, ఏజెంట్లు, మొక్కలు అధిక రేట్లకు అమ్ముకునేందుకు నర్సరీలకు, అందిస్తున్నారన్నారు. బొప్పాయి విత్తనాల,  లైసెన్సు డీలర్లు, రైల్వే కోడూరులో, షాపు ఏర్పాటు చేసి,ఇకపైన నేరుగా రైతులకు సరఫరా చేయాలని,  నేరుగా నర్సరీ లకు  అందించకుండా, చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. విత్తనాలు, అధిక ధరలకు బ్లాక్లో అమ్మకుండా, ఎమ్మార్పీ రేట్లు అమ్మాలని కోరారు. విత్తనాలు బ్లాక్ మార్కెట్ల అమ్మే డీలర్లపై చర్య తీసుకోవాలన్నారు. నాణ్యమైన బొప్పాయి విత్తనాలను, 25 శాతం సబ్సిడీతో ప్రభుత్వం రైతులకు, హార్టికల్చర్ , అగ్రికల్చర్, రైతు భరోసా కేంద్రాల ద్వారా, అందించాలని  కోరారు . బొప్పాయి విత్తనాలు, మరియు  మొలకలు, నర్సరీలు పైన ప్రభుత్వ నియంత్రణ ఉండాలన్నారు. బొప్పాయి మొక్కలను కొన్న రైతులకు, నర్సరీల నుండి, రసీదు బిల్లులు ఇప్పించాలని కోరారు. అనంతరము, రైల్వే కోడూరులో, బొప్పాయి మొలకలు పెంచుతున్న, కొన్ని  నర్సరీలను సందర్శించి పరిశీలించారు. అనంతరం, ఆర్టికల్చర్ హెచ్ ఓ, భాస్కర్ గారికి, సమస్యలతో కూడిన వినతి పత్రం, అందించారు. తమ పరిధిలో ఉన్న, నర్సరీలు పైన విచారించి చర్య తీసుకుంటామని, మిగతా విషయాలు, జిల్లా అధికారులు, కలెక్టర్ దృష్టికి తీసుకెళ్తానని,  హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్. రైతు సంఘ నాయకులు, పంది కాళ్ళ మణి, ఏదోటి ఆదినారాయణ, సుబ్బరాజు, ఈశ్వరయ్య, బాల, అంకయ్య, కేశవులు, సిఐటియు మండల  కార్యదర్శి, పి జాన్ ప్రసాద్, ఎస్ఎఫ్ఐ, జిల్లా ఉపాధ్యక్షులు,  పి. లతీఫ్, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.