అన్నమయ్య జిల్లా అక్టోబర్ 18 (పున్నమి ప్రతినిధి):
బొప్పాయి విత్తనాల బ్లాక్ మార్కెట్ అరికట్టి, ప్రభుత్వం సబ్సిడీతో సరఫరా చేయాలని, సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం, జిల్లా నాయకులు పంది కాళ్ల మణి, ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. వారు మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో రైల్వే కోడూరు ,రాజంపేట, పీలేరు, మదనపల్లి ప్రాంతాల్లో, బొప్పాయి రైతులు విస్తారంగా సాగు చేస్తారని, అక్టోబర్. నవంబర్లో, విత్తనాలు నర్సరీలో సాగు చేయడానికి, అందుబాటులో లేవని, మధ్య దళారులు, వ్యాపారస్తులు, నర్సరీలో, గతం కంటే రెట్టింపు ధరలో బ్లాక్ లో అమ్ముతున్నారు. లైసెన్స్ గలిగిన ఏజెన్సీలు ఎక్కడా లేవని, తైవాన్ రెడ్ లేడీ విత్తనాలు తైవాన్ నుంచి దిగుమతి చేసుకోవాల్సి ఉందని, అక్కడ అందుబాటులో లేవని, ప్రభుత్వం పట్టించుకోవడంలేదని,నకిలీ విత్తనాలు సరఫరా చేసే అవకాశం ఉందని, తక్షణం ప్రభుత్వం జోక్యం చేసుకొని, అగ్రికల్చర్, ఆర్టికల్చర్ ద్వారా, సబ్సిడీ విత్తనాలను, మొలకలను ప్రభుత్వం సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. గతంలో తైవాన్ రెడ్ లేడీ, 786 , ఒక కిలో విత్తనాలు నాలుగు లక్షలు ఉండగా, నేడు బ్లాకులో ఎనిమిది లక్షలకు అమ్ముతున్నారన్నారు. 10 గ్రాములు, ఎనిమిది వేలకు, అమ్ముతున్నారన్నారు, 10 గ్రాముల కు 60 మొలకలు, కేజీ 60 వేల మొలకలు, ఉంటాయని అంచనా ఉందన్నారు. ఎకరాకు 1000 మొలకలు పడతాయి అన్నారు.గతంలో నర్సరీలో 40 రోజుల మొలక, 11 రూపాయలతో కొనుగోలు చేయగా, నేడు 20 రూపాయలకు పెంచాలి అని ఆలోచన ఉన్నట్లు ఆందోళన వ్యక్తం చేశారు. నాణ్యమైన విత్తనాల సరఫరా కావాలంటే కంపెనీల నుండి రసీదులు లేకుండా సాగు చేసి నర్సరీల పైన చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంటల బీమా పథకాన్ని అమలు చేయాలన్నారు. సబ్సిడీ విత్తనాలు మొలకలు సరఫరా చేయడం కోసం, ఆందోళనకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.


