చిట్వేల్ (పున్నమి ప్రతినిధి) జూలై 26
అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం అంబేద్కర్ విగ్రహ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో సాయంత్రం బొప్పాయి రైతులు గిట్టుబాటు ధర కోసం నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పంది కాలమని మాట్లాడుతూ గత మూడు రోజులుగా చిట్టి వేల రైతులు వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారికి గిట్టుబాటు ధర కనీసం 25 రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. మొదట 16రూపాయలు నిర్ణయించి మూడు రోజుల్లో 13రూపాయలకు తగ్గించడంతో, రోజురోజుకి దళారులు సిండికేట్ ధర తగ్గించడంతో బొప్పాయి రైతులు ఆందోళనకు దిగారు అన్నారు. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వ్యాపారస్తులతోనూ మార్కెట్ అధికారులతోనూ రెవెన్యూ అధికారులతోనూ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర 25 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి విత్తనాలు మొలక కొనుగోలు, ఎరువులు దుక్కెలు కూలీలు మందులు ట్రాన్స్పోర్ట్ ధరలు విపరీతంగా పెరిగాయి అన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే రైతుల ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళారులు సూటు వడ్డీ, పర్సంటేజీ నకిలీ విత్తనాలు రైతుల్ని మోసం చేస్తున్నారన్నారు.దీనికి నిరసనగా 28వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకి రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని. రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు వై ఆదినారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఓ పెంచలయ్య తుంగ శివకృష్ణ కొండల సాయి బాబు ఎం బాల సంతోష్ రెడ్డి మన్నూరు విశ్వనాథరెడ్డి తుంగ కోటేశ్వర చౌదరి పురం రమణయ్య సి సుబ్బరాయుడు రవిరాజు వై ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

బొప్పాయి రైతులు గిట్టుబాటు ధర కల్పించాలని 28న రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా జయప్రదం చేయండి విలేకరుల సమావేశంలో రైతు సంఘాల పిలుపు
చిట్వేల్ (పున్నమి ప్రతినిధి) జూలై 26 అన్నమయ్య జిల్లా చిట్వేల్ మండలం అంబేద్కర్ విగ్రహ వద్ద ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సిఐటియు ఆధ్వర్యంలో సాయంత్రం బొప్పాయి రైతులు గిట్టుబాటు ధర కోసం నిరసన వ్యక్తం చేశారు. సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్ చంద్రశేఖర్, ఏపీ రైతు సంఘం జిల్లా నాయకులు పంది కాలమని మాట్లాడుతూ గత మూడు రోజులుగా చిట్టి వేల రైతులు వేలాది ఎకరాల్లో సాగు చేస్తున్న రైతులు ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. వారికి గిట్టుబాటు ధర కనీసం 25 రూపాయలు కల్పించాలని డిమాండ్ చేశారు. మొదట 16రూపాయలు నిర్ణయించి మూడు రోజుల్లో 13రూపాయలకు తగ్గించడంతో, రోజురోజుకి దళారులు సిండికేట్ ధర తగ్గించడంతో బొప్పాయి రైతులు ఆందోళనకు దిగారు అన్నారు. ప్రభుత్వం జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకొని వ్యాపారస్తులతోనూ మార్కెట్ అధికారులతోనూ రెవెన్యూ అధికారులతోనూ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేసి కనీస మద్దతు ధర 25 రూపాయలు నిర్ణయించాలని డిమాండ్ చేశారు. రైతులు పెట్టిన పెట్టుబడి విత్తనాలు మొలక కొనుగోలు, ఎరువులు దుక్కెలు కూలీలు మందులు ట్రాన్స్పోర్ట్ ధరలు విపరీతంగా పెరిగాయి అన్నారు. పెట్టిన పెట్టుబడి కూడా రాకపోతే రైతుల ఆత్మహత్యలు చేసుకోవాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. దళారులు సూటు వడ్డీ, పర్సంటేజీ నకిలీ విత్తనాలు రైతుల్ని మోసం చేస్తున్నారన్నారు.దీనికి నిరసనగా 28వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకి రాజంపేట సబ్ కలెక్టర్ ఆఫీస్ వద్ద ధర్నా నిర్వహించి వినతి పత్రం ఇవ్వడం జరుగుతుందని. రైతులందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకులు వై ఆదినారాయణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు ఓ పెంచలయ్య తుంగ శివకృష్ణ కొండల సాయి బాబు ఎం బాల సంతోష్ రెడ్డి మన్నూరు విశ్వనాథరెడ్డి తుంగ కోటేశ్వర చౌదరి పురం రమణయ్య సి సుబ్బరాయుడు రవిరాజు వై ప్రేమ్చంద్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో రైతులు పాల్గొన్నారు.

