రైల్వేకోడూరు సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
రైల్వేకోడూరు నియోజకవర్గంలో బొప్పాయి రైతులకు కలెక్టర్ నిర్ణయించిన ధరను అమలు చేయాలని ఏపీ రైతు సంఘం, సీఐటియు నాయకులు సబ్ కలెక్టర్‌కి వినతిపత్రం అందజేశారు. ప్రస్తుతం దళారులు బొప్పాయి ధరను ఐదు రూపాయలకు తగ్గించడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
కనీసం కలెక్టర్ నిర్ణయించిన రూ.10 ధరతో కొనుగోలు చేయాలని, గిట్టుబాటు కావాలంటే రూ.15 ఇవ్వాలని వారు డిమాండ్ చేశారు. దళారుల దోపిడీని అరికట్టేందుకు లైసెన్స్ విధానం పునరుద్ధరించాలని, ప్రభుత్వం నేరుగా కొనుగోలు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షుడు సిహెచ్. చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు చిట్వేల్ రవికుమార్, రైతు సంఘ నాయకులు ఆదినారాయణ, ఈశ్వరయ్య, వెంకటరమణ, హరిచరణ్ చౌదరి, సుబ్రహ్మణ్యం నాయుడు, శివకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.


