Sunday, 22 March 2026
  • Home  
  • బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర అమలు చేయాలని రైతు సంఘాల డిమాండ్
- ఆంధ్రప్రదేశ్

బొప్పాయి రైతులకు గిట్టుబాటు ధర అమలు చేయాలని రైతు సంఘాల డిమాండ్

అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గంలోని కోడూరు, చిట్వేల్, ఓబులవారిపల్లి, పుల్లంపేట, పెనగలూరు మండలాల్లో 15 వేల ఎకరాల్లో సాగు చేసిన బొప్పాయి పంటకు ధర కిలోకు 16 రూపాయల నుండి 5 రూపాయలకు పడిపోవడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కలెక్టర్ జోక్యంతో పది రూపాయల కనీస ధర నిర్ణయించినప్పటికీ వ్యాపారులు దాన్ని అమలు చేయకపోవడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా 50 శాతం పంట పొలాల్లో మిగిలి ఉందని, కనీసం పెట్టుబడి అయినా రాబట్టాలంటే కలెక్టర్ నిర్ణయించిన ధర తప్పనిసరిగా అమలు కావాలని సిఐటియు, రైతు సంఘ నాయకులు సబ్ కలెక్టర్‌కి వినతిపత్రం సమర్పించారు. బొప్పాయికి గిట్టుబాటు ధరగా 15 రూపాయలు నిర్ణయించి ప్రభుత్వమే మార్క్‌ఫెడ్ ద్వారా నేరుగా కొనుగోలు చేయాలని, దళారుల వ్యవస్థను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహెచ్. చంద్రశేఖర్, నాయకులు ఆదినారాయణ, రవికుమార్, ఈశ్వరయ్య, కందుల సుబ్రహ్మణ్యం,శివకేశవరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.