Friday, 6 February 2026
  • Home  
  • బొప్పాయి ధరలు పడిపోతే మాకు బతుకు లేదు” – పురుగుమందు సీసాలతో రైతుల ఆవేదన
- అన్నమయ్య

బొప్పాయి ధరలు పడిపోతే మాకు బతుకు లేదు” – పురుగుమందు సీసాలతో రైతుల ఆవేదన

బొప్పాయి ధరలు కిలోకు రూ.5కే పడిపోవడంతో చిట్వేల్ రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. తమ కష్టపడి పండించిన పంటకు ధర రాకపోతే ఆత్మహత్య తప్పదని వీడియోల ద్వారా హెచ్చరిస్తున్నారు.జిల్లా కలెక్టర్ రైతులు, అధికారులు, వ్యాపారులు, దళారులతో సమావేశం నిర్వహించి బొప్పాయిని రూ.10 కన్నా తక్కువకు కొనరాదని ఆదేశించినా, దళారులు పట్టించుకోక రైతులను దోచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ కూడా హెచ్చరించినా పరిస్థితి మారకపోవడంతో రైతుల్లో ఆగ్రహం, నిరాశ పెరిగిపోతున్నాయి.“మా చెమటను, మా పంటను ఇలా చులకన చేస్తే బ్రతకడం కష్టమే. న్యాయం చేయకపోతే ప్రాణాలు తీసుకోవాల్సిందే” అని రైతులు విలపిస్తున్నారు. ప్రజలు, స్థానిక సంఘాలు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని దళారుల దోపిడీని అరికట్టాలని, రైతులకు కనీస న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. Video: https://youtu.be/sBe-fpBU1ns

బొప్పాయి ధరలు కిలోకు రూ.5కే పడిపోవడంతో చిట్వేల్ రైతులు తీవ్ర ఆవేదనలో మునిగిపోయారు. తమ కష్టపడి పండించిన పంటకు ధర రాకపోతే ఆత్మహత్య తప్పదని వీడియోల ద్వారా హెచ్చరిస్తున్నారు.జిల్లా కలెక్టర్ రైతులు, అధికారులు, వ్యాపారులు, దళారులతో సమావేశం నిర్వహించి బొప్పాయిని రూ.10 కన్నా తక్కువకు కొనరాదని ఆదేశించినా, దళారులు పట్టించుకోక రైతులను దోచేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సబ్ కలెక్టర్ కూడా హెచ్చరించినా పరిస్థితి మారకపోవడంతో రైతుల్లో ఆగ్రహం, నిరాశ పెరిగిపోతున్నాయి.“మా చెమటను, మా పంటను ఇలా చులకన చేస్తే బ్రతకడం కష్టమే. న్యాయం చేయకపోతే ప్రాణాలు తీసుకోవాల్సిందే” అని రైతులు విలపిస్తున్నారు. ప్రజలు, స్థానిక సంఘాలు అధికారులు వెంటనే జోక్యం చేసుకొని దళారుల దోపిడీని అరికట్టాలని, రైతులకు కనీస న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.

Video: https://youtu.be/sBe-fpBU1ns

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.