పున్నమి ప్రతినిధి, ఘట్ కేసర్:
ఘట్ కేసర్ మండలం బొక్కోని గూడ గ్రామంలో అనురాగ్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గ్రామీణ వ్యవసాయ కృషి అనుభవ కార్యక్రమం నిర్వహించారు.అగ్రికల్చర్ 4వ సంవత్సరం విద్యార్థులు గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణాత్మక సదస్సుని (పీఆర్ఏ) నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులు గ్రామ రైతుల నుండి సమాచారం సేకరించారు. గ్రామం సామాజిక, వనరుల పటాన్ని గీసి వివరించారు.ఈ సందర్భంగా వ్యవసాయ కాలచక్రం,సీజనల్ కేలండర్‌తోపాటు,వ్యవసాయ సాగులో ఉన్న సమస్యలను, వాటిని అధిగమించేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివరించారు. వివిధ రకాల పంటల గురించి రైతులకు అవగాహన కల్పించారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ కళాశాల ఆధ్యాపకులు రవి, దివాకర్,అభ్యుదయ రైతులు,విద్యార్థిని, విద్యార్ధులు పాల్గొన్నారు.


