ఖమ్మం పున్నమి ప్రతినిధి
గత 10రోజులు గా పూజలు అందుకున్న గణ నాధులు శనివారం నాడు నిమజ్జనం కి తరలి వెళ్లారు. ఖమ్మం నగరం లో సుమారు గా 100కి పైగా గణ నాదులు కొలువై 10రోజు లు పూజలు అందుకున్నారు. గాంధీ చౌక్ నందు ఏర్పాటు చేసిన సామూహిక గణ నాధుల కి స్వాగత వేదిక మొత్తం ఖమ్మం నగరం నుండి మున్నేరు లో నిమజ్జనం అవ్వడానికి తరలి వచ్చే గణ నాధులకి స్వాగతము పలికారు. మంత్రి తుమ్మల నాగేస్వరావ్, స్థంబాద్రి గణేష్ ఉత్సవ సమితి బాద్యులు స్వాగత కార్యక్రమం లో పాల్గొన్నారు. కమిషనర్ సునీల్ దత్ ఆధ్వర్యంలో ఎటువంటి అవాంఛనీయ ఘటన లు జరగకుండా ఏర్పాట్లు చేశారూ.

