డిపార్ట్మెంట్ ఆఫ్ ఉర్దూ ఆధ్వర్యంలో డా. నహేదా తబస్సుం మాట్లాడుతూ
భారత రత్న, మాజీ రాష్ట్రపతి, ప్రజల హృదయాలను గెలుచుకున్న మహానీయుడు, మిసైల్ మాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జయంతిని బైంసా గవర్నమెంట్ డిగ్రీ కళాశాలలో ఘనంగా నిర్వహించారు.
కళాశాల ప్రిన్సిపల్ కరోల్ల బుచ్చయ్య మాట్లాడుతూ – “కలాం గారు విజ్ఞానానికి శ్రమ, విద్యార్థులకు స్ఫూర్తి, దేశాభివృద్ధికి మార్గదర్శకుడు. ఆయన కలలు, ఆలోచనలు యువతను ఎప్పటికీ ముందుకు నడిపిస్తాయి. విద్యారంగం, విజ్ఞానశాస్త్రం, నాయకత్వం రంగాలలో కలాం చేసిన కృషి చిరస్మరణీయం. ఆయన చూపిన మార్గం నేటి యువతకు మాత్రమే కాదు, రాబోయే తరాలకు కూడా స్ఫూర్తిదాయకం” అని అన్నారు.
అలాగే కళాశాల వైస్ ప్రిన్సిపల్ రఘునాథ్ మాట్లాడుతూ – “డ్రీమ్ బిగ్ – వర్క్ హార్డ్ – అచీవ్ గ్రేట్” అన్న కలాం గారి మాటలు ఇప్పటికీ ప్రతి విద్యార్థి హృదయంలో మారుమ్రోగుతున్నాయి. కష్టపడి పనిచేస్తే ఏదైనా సాధ్యమే అని ఆయన జీవితం మనకు చూపిస్తుంది. ఆయన కలలు కనమని, కష్టపడమని చెప్పిన సందేశం దేశ యువతకు చిరస్మరణీయ పాఠం” అని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ – “కలాం గారి కలలు, కృషి, ఆత్మవిశ్వాసం నేటి తరానికి ఆదర్శం. దేశాన్ని ప్రపంచ శక్తిగా మార్చాలనే ఆయన కలను నెరవేర్చడం మనందరి బాధ్యత” అని అన్నారు.
కార్యక్రమంలో విద్యార్థులు కూడా కలాం గారి సూక్తులను పఠిస్తూ, ఆయన జీవిత చరిత్రపై ప్రసంగాలు చేశారు. “స్వప్నం కని, వాటిని సాకారం చేసేందుకు శ్రమించండి” అన్న ఆయన సందేశం తమ జీవితంలో అద్భుతమైన ప్రేరణగా మారిందని విద్యార్థులు పేర్కొన్నారు.
కళాశాల ప్రాంగణంలో నిర్వహించిన ఈ వేడుకలో విద్యార్థులు కలాం గారి ప్రసంగాల వీడియోలు, జీవిత చరిత్రపై రూపొందించిన డాక్యుమెంటరీని వీక్షించి గొప్ప స్ఫూర్తి పొందారు.
ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు డా. పీజీ రెడ్డి, డా. పవన్ కుమార్ పాండే, డా. శంకర్, యు. రవికుమార్, డా. ఓమ్ ప్రకాష్, ఎ. రాజు, డా. న. హేదా, డా. కల్పన, మజర్, వహీద్, ఇర్ఫాన్, సురేందర్, రాజయ్య, కిషన్, మోహన్, అబ్దుల్లా, దివ్య, ఆఫ్రీన్ , ఆఫీస్ సిబ్బంది,విద్యార్థిని, విద్యార్థులు పాల్గొని మహానీయుడికి ఘనంగా నివాళులు అర్పించారు.


