బేస్ బాల్ రాష్ట్ర జట్టుకు ఎంపికైన ఎస్.వి. కళాశాల విద్యార్థిని సాహితి
రైల్వే కోడూరు పున్నమి ప్రతినిధి
రైల్వే కోడూరు ఎస్వీ కళాశాలలో రెండవ సంవత్సరం బైపీసీ ఇంగ్లీష్ మీడియం విద్యార్థిని యు.సాహితి రాష్ట్ర బేస్ బాల్ జట్టుకు ఎంపికైనట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎస్ ఎన్ శ్రీనివాసులు తెలిపారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే కోడూరులో ఈనెల 15, 16, 17 తేదీలలో రైల్వే కోడూరు గవర్నమెంట్ జూనియర్ కళాశాల మైదానంలో జరిగిన బేస్ బాల్ పోటీలలో మంచి ప్రతిభ కనబరిచి జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన విద్యార్థిని యు.సాహితి జనవరి మొదటి వారం ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీలలో పాల్గొంటుందని ఎస్వీ జూని యర్ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.ఎన్. శ్రీనివాసులు, డైరెక్టర్ ఎస్.వసుంధర అండ్ పిఇటి పుల్లారావు తెలియజేశారు.


