Sunday, 7 December 2025
  • Home  
  • బెల్లంపల్లి తొలి ఎంఎల్ఏ గుండా మల్లేష్ ఐదవ వర్ధంతి కార్యక్రమం
- కుమురం భీమ్ ఆసిఫాబాద్

బెల్లంపల్లి తొలి ఎంఎల్ఏ గుండా మల్లేష్ ఐదవ వర్ధంతి కార్యక్రమం

బెల్లంపల్లి తొలి ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఐదో వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది… సిపిఐ గోలేటి పట్టణ కార్యదర్శి మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్,కార్యదర్శి సోమవారం తిరుపతి గారు, సిపిఐ మండల కార్యదర్శి రాయల నరసయ్య గారి ఆధ్వర్యంలో గోలేటి లోని కేల్ మహేంద్ర భవన్ భవన్ లొ కామ్రేడ్ గుండా మల్లేష్ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఎస్ తిరుపతి గారు మాట్లాడుతూ నల్ల నేలపై విప్లవాల రాగాలు పలికించిన గుండా మల్లేష్. బెల్లంపల్లి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా. మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామంలో జులై 14/1947/లో గుండా మల్లేష్ జన్మించారు. తల్లి బాయమ్మ-తండ్రి పోషమల్లు. గుండా మల్లేష్ హెచ్ ఎస్ సీ వరకు చదువుకున్నారు. లారీ క్లీనర్ నుంచి ఎమ్మెల్యే వరకు . ఆయన రాజకీయ అరం గేట్రం పోరాటంతోనే ప్రారంభమైంది. 1967-1968 లో బెల్లంపల్లిలో ప్రకాష్ లారీ ట్రాన్స్ పోర్టులో క్లీనర్కమ్ డ్రైవర్ గా పని చేసేవారు. వేతనాల విషయంలో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. అనంతరం కొద్ది రోజులు సింగరేణిలో కార్మికుడిగా పనిచేశారు. ఆ సమయంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లో చేరి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంబించారు. పేదల పక్షాన భూ పోరాటాలు చేశారు 1972లో పార్టీలో చేరిన గుండా మల్లేష్ వేను దిరిగి చూడలేదు. ఉద్యమాలే ఊపిరిగా పనిచేశారు. ఫలితంగా తొలిసారి 1978లో ఆసిఫాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు. అనంతరం 1983-1985-1994 ఎన్నికల్లో విజయం సాధించారు. తిరిగి కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గ నుంచి 2009లో పోటీ చేసి గెలుపొందారు. 2004 మరియు 2018లో ఓడిపోయారు. మొత్తం ఎనిమిది సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర. తెలంగాణ రాష్ట్ర సాధనలోను ఆయన చెరగని ముద్ర వేశారు. శాసనసభ పక్ష నేతగా తెలంగాణ వాణి ని ఢిల్లీలో బలంగా వినిపించారు. కేంద్ర ప్రభుత్వంలో జరిగిన చర్చల్లోనూ సిపిఐ శాసనసభ పక్ష నేత హోదాలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో కలిసి పలుమార్లు హాజరయ్యారు. శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ వాదనను బలంగా వినిపించగలరు. పోరాటాల్లో ఆయనది ప్రత్యేక స్థానం. భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్). అఖిలాభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్). లో చురుకుగా పనిచేసిన గుండా మల్లేష్ అంచలంచలుగా జాతీయ స్థాయిలో రాణించారు. 4. సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుండా మల్లేష్ బి కే ఎం యు జాతీయ ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1983లో టిడిపి సంక్షోభ సమయంలో కీలకంగా నిలిచారు. బెల్లంపల్లిలో జరిగిన అనేక ఉద్యమాల్లో కూడా ఆయన తిరుగులేని నాయకునిగా కొనసాగారు. 1981 లో బెల్లంపల్లిలో యువతిని ఒక అధికారి కుమారుడు అత్యాచారం చేసిన కేసులో జరిగిన పోరాటంలో గుండా మల్లేష్ పాత్ర మరువలేనిది అసంఘటిత. సంఘటిత రంగా పోరాటాలు తనదైన పాత్రను పోషించారు. రైతాంగ సమస్యల సాధనలోనూ ఆయన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు. పార్టీల కతీతంగా స్పందించే నైజాం. గుండా మల్లేష్ పార్టీలకతీతంగా వ్యవహరించేవారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే వారు. ఎన్నికలు అయ్యాక పార్టీల గురించి ఆలోచించే వద్దని ప్రజల సంక్షేమమే ద్వేయం కావాలని చెబుతుండేవారు. అందుకే ఏ పార్టీ వారైనా గుండా మల్లేష్ అంటే అభిమానిస్తారు. నిరాడంబర జీవనం:4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గుండా మల్లేష్ ఏనాడు అంగు ఆర్భాటాల జోలికి పోలేదు అవినీతికి ఆమడ దూరంలో ఉన్నారు. ఆయన సాదాసీదా జీవనం గడిపారు. కార్మిక. కర్షక. గిరిజన. మహిళల సమస్యలపై అలుపెరుగని పోరాట యోధుడు గుండా మల్లేష్ గారు అని ఆయన అన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శి బి జగ్గయ్య, గోలేటి బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిలు, శేషశైనా రావు, కే కిరణ్ బాబు, గోలేటి బ్రాంచ్ కాంటాక్ట్ కార్మిక కార్యదర్శి, సల్లూరి అశోక్, సహాయ కార్యదర్శి, సాగర్ గౌడ్ , ఏఐటీయూసీ యూనియన్ డెలికేట్స్, అన్వేష్,కందుల మల్లేష్, పుట్ట అంజయ్య, ఎండి షకిల్,నాదం రవి, ఎంఏ షమీ, రమేష్, తిరుమల్, రారాజు, అంజయ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

బెల్లంపల్లి తొలి ఎమ్మెల్యే గుండా మల్లేష్ ఐదో వర్ధంతిని ఘనంగా నిర్వహించి నివాళులు అర్పించడం జరిగింది…
సిపిఐ గోలేటి పట్టణ కార్యదర్శి
మారం శ్రీనివాస్ ఆధ్వర్యంలో ముఖ్య అతిథులు
ఏఐటీయూసీ గోలేటి బ్రాంచ్,కార్యదర్శి సోమవారం తిరుపతి గారు, సిపిఐ మండల కార్యదర్శి రాయల నరసయ్య గారి ఆధ్వర్యంలో గోలేటి లోని కేల్ మహేంద్ర భవన్ భవన్ లొ కామ్రేడ్ గుండా మల్లేష్ గారి 5వ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది. ఎస్ తిరుపతి గారు మాట్లాడుతూ నల్ల నేలపై విప్లవాల రాగాలు పలికించిన గుండా మల్లేష్. బెల్లంపల్లి నియోజకవర్గ తొలి ఎమ్మెల్యేగా.
మంచిర్యాల జిల్లా తాండూర్ మండలం రేచిని గ్రామంలో జులై 14/1947/లో గుండా మల్లేష్ జన్మించారు. తల్లి బాయమ్మ-తండ్రి పోషమల్లు. గుండా మల్లేష్ హెచ్ ఎస్ సీ వరకు చదువుకున్నారు.
లారీ క్లీనర్ నుంచి ఎమ్మెల్యే వరకు .
ఆయన రాజకీయ అరం గేట్రం పోరాటంతోనే ప్రారంభమైంది. 1967-1968 లో బెల్లంపల్లిలో ప్రకాష్ లారీ ట్రాన్స్ పోర్టులో క్లీనర్కమ్ డ్రైవర్ గా పని చేసేవారు. వేతనాల విషయంలో జరిగిన ఉద్యమానికి నాయకత్వం వహించారు. అనంతరం కొద్ది రోజులు సింగరేణిలో కార్మికుడిగా పనిచేశారు.
ఆ సమయంలోనే భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ లో చేరి పూర్తిస్థాయిలో పనిచేయడం ప్రారంబించారు. పేదల పక్షాన భూ పోరాటాలు చేశారు 1972లో పార్టీలో చేరిన గుండా మల్లేష్ వేను దిరిగి చూడలేదు. ఉద్యమాలే ఊపిరిగా పనిచేశారు. ఫలితంగా తొలిసారి 1978లో ఆసిఫాబాద్ నియోజక వర్గం నుంచి పోటీ చేసే అవకాశం వచ్చింది ఆ ఎన్నికల్లో ఆయన ఓడిపోయారు.
అనంతరం 1983-1985-1994 ఎన్నికల్లో విజయం సాధించారు. తిరిగి కొత్తగా ఏర్పడిన బెల్లంపల్లి నియోజకవర్గ నుంచి 2009లో పోటీ చేసి గెలుపొందారు. 2004 మరియు 2018లో ఓడిపోయారు. మొత్తం ఎనిమిది సార్లు పోటీ చేసి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.
తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర.
తెలంగాణ రాష్ట్ర సాధనలోను ఆయన చెరగని ముద్ర వేశారు. శాసనసభ పక్ష నేతగా తెలంగాణ వాణి ని ఢిల్లీలో బలంగా వినిపించారు.
కేంద్ర ప్రభుత్వంలో జరిగిన చర్చల్లోనూ సిపిఐ శాసనసభ పక్ష నేత హోదాలో టిఆర్ఎస్ అధినేత కేసిఆర్ తో కలిసి పలుమార్లు హాజరయ్యారు. శ్రీకృష్ణ కమిటీ ముందు తెలంగాణ వాదనను బలంగా వినిపించగలరు.
పోరాటాల్లో ఆయనది ప్రత్యేక స్థానం.
భారత కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ) అఖిల భారత యువజన సమాఖ్య (ఏఐవైఎఫ్). అఖిలాభారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్). లో చురుకుగా పనిచేసిన గుండా మల్లేష్ అంచలంచలుగా జాతీయ స్థాయిలో రాణించారు. 4. సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన గుండా మల్లేష్ బి కే ఎం యు జాతీయ ఉపాధ్యక్షుడిగా రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు.
1983లో టిడిపి సంక్షోభ సమయంలో కీలకంగా నిలిచారు. బెల్లంపల్లిలో జరిగిన అనేక ఉద్యమాల్లో కూడా ఆయన తిరుగులేని నాయకునిగా కొనసాగారు. 1981 లో బెల్లంపల్లిలో యువతిని ఒక అధికారి కుమారుడు అత్యాచారం చేసిన కేసులో జరిగిన పోరాటంలో గుండా మల్లేష్ పాత్ర మరువలేనిది అసంఘటిత. సంఘటిత రంగా పోరాటాలు తనదైన పాత్రను పోషించారు. రైతాంగ సమస్యల సాధనలోనూ ఆయన రాష్ట్రంలో అనేక జిల్లాల్లో జరిగిన పోరాటాల్లో పాల్గొన్నారు.
పార్టీల కతీతంగా స్పందించే నైజాం.
గుండా మల్లేష్ పార్టీలకతీతంగా వ్యవహరించేవారు. ఇంటికి వచ్చిన ప్రతి ఒక్కరి కష్టాలు తెలుసుకొని అక్కడికక్కడే పరిష్కరించే వారు.
ఎన్నికలు అయ్యాక పార్టీల గురించి ఆలోచించే వద్దని ప్రజల సంక్షేమమే ద్వేయం కావాలని చెబుతుండేవారు. అందుకే ఏ పార్టీ వారైనా గుండా మల్లేష్ అంటే అభిమానిస్తారు.
నిరాడంబర జీవనం:4 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన గుండా మల్లేష్ ఏనాడు అంగు ఆర్భాటాల జోలికి పోలేదు అవినీతికి ఆమడ దూరంలో ఉన్నారు. ఆయన సాదాసీదా జీవనం గడిపారు. కార్మిక. కర్షక. గిరిజన. మహిళల సమస్యలపై అలుపెరుగని పోరాట యోధుడు గుండా మల్లేష్ గారు అని ఆయన అన్నా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. సిపిఐ మండల సహాయ కార్యదర్శి బి జగ్గయ్య, గోలేటి బ్రాంచ్ ఆర్గనైజింగ్ కార్యదర్శిలు, శేషశైనా రావు, కే కిరణ్ బాబు, గోలేటి బ్రాంచ్ కాంటాక్ట్ కార్మిక కార్యదర్శి, సల్లూరి అశోక్, సహాయ కార్యదర్శి, సాగర్ గౌడ్ , ఏఐటీయూసీ యూనియన్ డెలికేట్స్, అన్వేష్,కందుల మల్లేష్, పుట్ట అంజయ్య, ఎండి షకిల్,నాదం రవి, ఎంఏ షమీ, రమేష్, తిరుమల్, రారాజు, అంజయ్య, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.