సెప్టెంబర్ 02 పున్నమి ప్రతినిధి @
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్‌పై విధించిన 50% సుంకాలు ఎగుమతి రంగాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ఈ సుంకాలు భారత వస్త్రాలు, రసాయనాలు, ఆభరణాలు, ఆక్వా రంగాలపై గణనీయమైన ఒత్తిడిని తెచ్చాయి.
అయినప్పటికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సుంకాలపై బహిరంగంగా స్పందించకుండా, నిశ్శబ్దంగా వ్యూహాత్మక చర్చలకు పరిమితమయ్యారు. మోదీ కాళ్లబేరానికి వస్తాడని భావించిన ట్రంప్‌కు భంగాపాటే ఎదురైంది. ఇది భారత దీర్ఘకాలిక వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని గుర్తు చేసింది. భారత్ అమెరికా ఒత్తిడికి లొంగకుండా ఇతర దేశాలతో సంబంధాలను బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తోంది. దీంతో సైలెంట్‌గా అగ్రరాజ్యానికి షాక్ ఇవ్వబోతోంది.


