Tuesday, 24 March 2026
  • Home  
  • బురదజల్లడం ఈవీఎం ఎమ్మెల్యేకి అలవాటే, మీ ప్రభుత్వం ఉంది మరి నిరూపించాలి కదా.
- తూర్పు గోదావరి

బురదజల్లడం ఈవీఎం ఎమ్మెల్యేకి అలవాటే, మీ ప్రభుత్వం ఉంది మరి నిరూపించాలి కదా.

రాజమహేంద్రవరం : ఆధారాల్లేని ఆరోపణలతో బురదజల్లడం ఈవీఎం ఎమ్మెల్యేకి అలవాటేనని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఎన్నికల ముందు కూడా 25శాతం కమీషన్ తీసుకున్నట్లు, ముడుపులు తీసుకున్నట్లు బురదజల్లుతూ కరపత్రాలు వేశారని ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ఎందుకు నిరూపించడం లేదని ఆయన ప్రశించారు బుధవారం భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు పేపర్ మిల్లు వ్యవహారంలో కూడా తనకేదో సూటుకేసులు అందించారని అనడం శోచనీయమన్నారు. దమ్ముంటే అధరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఐదేళ్ల క్రితం ఆయన రూ 9వేలు వేతనం పెంచి అగ్రిమెంట్ చేసారని, మరి ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో ప్రగల్భాలు పలికి రూ 5800 అగ్రిమెంట్ చేసారని భరత్ వ్యాఖ్యానించారు. ఒక్క రూపాయి అయినా ఎక్కువ అగ్రిమెంట్ చేయాలి కదా అని ఆయన నిలదీసారు. ఎవరు మగాడని ఆయన అన్నారు. తొమ్మిదివేలకు అదనంగా ఒక్కరూపాయి అయినా ఒప్పందం చేస్తే శభాష్ అంటారు కదా, మరి 5800చేసి ఏవేవో కబుర్లు చెప్తే ఎలా అని భరత్ నిలదీశారు. అలాగే గతంలో మా హయాంలో మేనేజ్ మెంట్ ని ఒప్పించి రూ 6500చేస్తామంటే ఎందుకు అడ్డుకున్నారని భరత్ అడిగారు. ఆరునెలల్లో ఈ ప్రభుత్వం పోతుంది నేను వస్తే రూ10వేలు, 10,500, 12వేలు చేస్తామని నోటికొచ్చినట్లు చెప్పిన ఈవీఎం ఎమ్మెల్యే ఇప్పుడు రూ 5800 పెంచడమేంటి అని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో కార్మికులు వెనక్కి తగ్గి ఇంకా ఎక్కువ వేతనం వస్తుందని భావించారని ఆయన గుర్తుచేసారు. ఇక ఆదిరెడ్డి అప్పారావు కూడా ఏదేదో మాట్లాడి, 50శాతం డిస్కౌంట్ అన్నారని, మరి ఇపుడు చేసిన అగ్రిమెంట్ ద్వారా మేనేజ్మెంట్ కి కోట్ల రూపాయలు మిగిల్చి సూటుకేసులు పట్టుకెళ్లినట్టు కాదా అని ఆయన వ్యాఖ్యానించారు. మోసం చేశానని తనపై అభాండాలు వేస్తున్నారని, నిజానికి రూ 6500అగ్రిమెంట్ చేస్తానంటే, అడ్డుకుని, అంతకంటే తక్కువకు అగ్రిమెంట్ చేయడం మోసం కాదా అని భరత్ నిలదీసారు. నేను ఆస్తులు ఏమీ కొనలేదని, ఉన్నవి అమ్ముకున్నాని భరత్ అన్నారు. కార్మికులను పర్మినెంట్ చేయడానికి నాకు, ప్రభుత్వానికి, రాజకీయాలకు సంబంధం ఏమిటని భరత్ ప్రశ్నించారు. అది మేనేజ్మెంట్ పని అన్నారు. మరి మేనేజ్మెంట్ సూటుకేసులు వచ్చి నాకు ఇచ్చారా అన్నారు. అలాగే పరంపర మిల్లు యాజమాన్యం చేస్తే నాకు సంబంధం ఏమిటన్నారు. పరంపర వన్, పరంపర 2, కొర్ , నాన్ కోరు, టెంపరరీ పోస్టుల పర్మినెంట్ వంటివన్నీ కల్పి 324పోస్టులు 2014నుంచి 2024దాకా జరిగాయని, 2023దాకా ప్రవీణ్ చౌదరి టీఎన్టీయూసీ లీడర్ గానే తెలుగుదేశంలో ఉన్నాడని అయన గుర్తుచేసారు.2023వరకు 324పోస్టుల్లో 270పోస్టులు ప్రవీణ్ చౌదరి టీడీపీలో ఉండగానే జరిగాయి కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అని భరత్ నిలదీశారు. అప్పుడు వాషింగ్ మెషిన్ లో కడిగి ఉన్నాడా అన్నారు. ప్రవీణ్ చౌదరి కి కొమ్ముకాయాల్సిన అవసరం నాకులేదన్నారు. టీఎన్టీయూసీ నుంచి 300,400మంది కార్మికులు వచ్చి కలిస్తే , కార్మికుల బలం వైసిపికి చేరుతుందని పార్టీలోకి తీసుకున్నానని ఆయన స్పష్టంచేసారు. అంతేకాని నేను సూటు కేసులు తీసుకున్నానని, నేను డబ్బులు తీసుకున్నానని మాట్లాడ్డం శోచనీయం. ఇలా మాట్లాడేముందు ఆధారాలు చూపించాలని భరత్ సవాల్ చేసారు. ఆచితూచి మాట్లాడ్డం నేర్చుకోవాలని అన్నారు. రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని భరత్ ఆరోపించారు. సుబ్రహ్మణ్య మైదానంలో నిద్రపోతున్న వృద్ధునిపై దాడిచేసి బ్లేడ్లతో చెక్కేసారని ఆయన అన్నారు. ఇంతదారుణంగా రాజమండ్రిలో వ్యవస్థ పాడుచేసారని ఆయన మండిపడ్డారు. తన హయాంలో రాజమండ్రి ఎలా తయారుచేసాను, ఇప్పుడు ఎలా తయారవుతోంది అని ఆయన ప్రశ్నించారు. ఒక పక్క చెత్త శుభ్రం చేయరని, ఎక్కడ బడితే చెత్త కనిపిస్తోందని, వీధి దీపాలు వెలగవని, కళావిహీనంగా తయారుచేశారని భరత్ విమర్శించారు.

రాజమహేంద్రవరం :
ఆధారాల్లేని ఆరోపణలతో బురదజల్లడం ఈవీఎం ఎమ్మెల్యేకి అలవాటేనని వైఎస్ఆర్సిపి రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎంపీ మార్గాని భరత్ రామ్ అన్నారు. ఎన్నికల ముందు కూడా 25శాతం కమీషన్ తీసుకున్నట్లు, ముడుపులు తీసుకున్నట్లు బురదజల్లుతూ కరపత్రాలు వేశారని ఆయన గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చాక ఎందుకు నిరూపించడం లేదని ఆయన ప్రశించారు బుధవారం భరత్ మీడియాతో మాట్లాడుతూ ఇప్పుడు పేపర్ మిల్లు వ్యవహారంలో కూడా తనకేదో సూటుకేసులు అందించారని అనడం శోచనీయమన్నారు. దమ్ముంటే అధరాలు బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేసారు. ఐదేళ్ల క్రితం ఆయన రూ 9వేలు వేతనం పెంచి అగ్రిమెంట్ చేసారని, మరి ఈవీఎం ఎమ్మెల్యే ఎన్నో ప్రగల్భాలు పలికి రూ 5800 అగ్రిమెంట్ చేసారని భరత్ వ్యాఖ్యానించారు. ఒక్క రూపాయి అయినా ఎక్కువ అగ్రిమెంట్ చేయాలి కదా అని ఆయన నిలదీసారు. ఎవరు మగాడని ఆయన అన్నారు. తొమ్మిదివేలకు అదనంగా ఒక్కరూపాయి అయినా ఒప్పందం చేస్తే శభాష్ అంటారు కదా, మరి 5800చేసి ఏవేవో కబుర్లు చెప్తే ఎలా అని భరత్ నిలదీశారు.
అలాగే గతంలో మా హయాంలో మేనేజ్ మెంట్ ని ఒప్పించి రూ 6500చేస్తామంటే ఎందుకు అడ్డుకున్నారని భరత్ అడిగారు. ఆరునెలల్లో ఈ ప్రభుత్వం పోతుంది నేను వస్తే రూ10వేలు, 10,500, 12వేలు చేస్తామని నోటికొచ్చినట్లు చెప్పిన ఈవీఎం ఎమ్మెల్యే ఇప్పుడు రూ 5800 పెంచడమేంటి అని ఆయన ప్రశ్నించారు. అప్పట్లో కార్మికులు వెనక్కి తగ్గి ఇంకా ఎక్కువ వేతనం వస్తుందని భావించారని ఆయన గుర్తుచేసారు. ఇక ఆదిరెడ్డి అప్పారావు కూడా ఏదేదో మాట్లాడి, 50శాతం డిస్కౌంట్ అన్నారని, మరి ఇపుడు చేసిన అగ్రిమెంట్ ద్వారా మేనేజ్మెంట్ కి కోట్ల రూపాయలు మిగిల్చి సూటుకేసులు పట్టుకెళ్లినట్టు కాదా అని ఆయన వ్యాఖ్యానించారు. మోసం చేశానని తనపై అభాండాలు వేస్తున్నారని, నిజానికి రూ 6500అగ్రిమెంట్ చేస్తానంటే, అడ్డుకుని, అంతకంటే తక్కువకు అగ్రిమెంట్ చేయడం మోసం కాదా అని భరత్ నిలదీసారు. నేను ఆస్తులు ఏమీ కొనలేదని, ఉన్నవి అమ్ముకున్నాని భరత్ అన్నారు.
కార్మికులను పర్మినెంట్ చేయడానికి నాకు, ప్రభుత్వానికి, రాజకీయాలకు సంబంధం ఏమిటని భరత్ ప్రశ్నించారు. అది మేనేజ్మెంట్ పని అన్నారు. మరి మేనేజ్మెంట్ సూటుకేసులు వచ్చి నాకు ఇచ్చారా అన్నారు. అలాగే పరంపర మిల్లు యాజమాన్యం చేస్తే నాకు సంబంధం ఏమిటన్నారు. పరంపర వన్, పరంపర 2, కొర్ , నాన్ కోరు, టెంపరరీ పోస్టుల పర్మినెంట్ వంటివన్నీ కల్పి 324పోస్టులు 2014నుంచి 2024దాకా జరిగాయని, 2023దాకా ప్రవీణ్ చౌదరి టీఎన్టీయూసీ లీడర్ గానే తెలుగుదేశంలో ఉన్నాడని అయన గుర్తుచేసారు.2023వరకు 324పోస్టుల్లో 270పోస్టులు ప్రవీణ్ చౌదరి టీడీపీలో ఉండగానే జరిగాయి కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదని అని భరత్ నిలదీశారు. అప్పుడు వాషింగ్ మెషిన్ లో కడిగి ఉన్నాడా అన్నారు. ప్రవీణ్ చౌదరి కి కొమ్ముకాయాల్సిన అవసరం నాకులేదన్నారు. టీఎన్టీయూసీ నుంచి 300,400మంది కార్మికులు వచ్చి కలిస్తే , కార్మికుల బలం వైసిపికి చేరుతుందని పార్టీలోకి తీసుకున్నానని ఆయన స్పష్టంచేసారు. అంతేకాని నేను సూటు కేసులు తీసుకున్నానని, నేను డబ్బులు తీసుకున్నానని మాట్లాడ్డం శోచనీయం. ఇలా మాట్లాడేముందు ఆధారాలు చూపించాలని భరత్ సవాల్ చేసారు. ఆచితూచి మాట్లాడ్డం నేర్చుకోవాలని అన్నారు.
రాజమండ్రిలో బ్లేడ్ బ్యాచ్ ఆగడాలు మితిమీరిపోతున్నాయని భరత్ ఆరోపించారు. సుబ్రహ్మణ్య మైదానంలో నిద్రపోతున్న వృద్ధునిపై దాడిచేసి బ్లేడ్లతో చెక్కేసారని ఆయన అన్నారు. ఇంతదారుణంగా రాజమండ్రిలో వ్యవస్థ పాడుచేసారని ఆయన మండిపడ్డారు. తన హయాంలో రాజమండ్రి ఎలా తయారుచేసాను, ఇప్పుడు ఎలా తయారవుతోంది అని ఆయన ప్రశ్నించారు. ఒక పక్క చెత్త శుభ్రం చేయరని, ఎక్కడ బడితే చెత్త కనిపిస్తోందని, వీధి దీపాలు వెలగవని, కళావిహీనంగా తయారుచేశారని భరత్ విమర్శించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.