5-06-2020 బుచ్చిరెడ్డిపాలెం (పున్నమి విలేఖరి – జి.పి.ప్రవీణ్) బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని రామకృష్ణ నగర్ లో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం కు ముఖ్య అతిథిగా వ్యవహరించిన నగర పంచాయతీ కమిషనర్ శ్రీనివాస రావు మాట్లాడుతూ కాలుష్య రహిత పర్యావరణాన్ని భావితరాలకు సంపదగా అందించడదానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని తెలిపారు. ఈ ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని నగర పంచాయతీలోని శ్రీ రామ్ నగర్ ,శివాజీ నగర్,రామకృష్ణ నగర్ తదితర ప్రాంతాలలో మొక్కలు నాటి అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యావరణ స్పృహతో ఈ కార్యక్రమం చేపట్టిన స్థానికులను ప్రత్యేకంగా అభినందించారు. ప్లాస్టిక్ వాడకాన్ని నిషేధించి విరివిగా మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు. అడవుల విస్తీర్ణం తగ్గుతూ ఉండటం వలన పర్యావరణంలో మార్పులు ఏర్పడుతున్నాయి అన్నారు. పర్యావరణ అసమతుల్యత వలన కరోనా, ఎబోలా లాంటి వైరస్ లు విజృంభిస్తున్నాయని అన్నారు.
ఈ కార్యక్రమం అనంతరం బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీ పరిధిలోని ఇసుక పాలెం గ్రామ పంచాయతీ బిట్టు 2లో వాలంటీర్లకు గ్రామ సచివాలయం సిబ్బందికి నగర పంచాయతీ కమిషనర్ మీటింగ్ ను ఏర్పాటు చేశారు. ఈ మీటింగ్ లో వాలంటీర్లు ప్రతిరోజూ చేసే కార్యక్రమాల గురించి వాళ్ల డైరీలో రాసుకోవాలని మరియు ఇంటి పన్నుల వసూలు చేస్తున్నారా లేదా అని వివరాలను అడిగి తెలుసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని అర్హులైన లబ్ధిదారులకు ఇంటికి వద్దకే చేర్చడంలో వాలంటీర్లు ముఖ్య పాత్ర పోషించాలని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇసుక పాలెం పంచాయతీలోని బిట్టు1, బిట్టు2 గ్రామ సచివాలయ సిబ్బంది మరియు వాలెంటర్ల్లు వీఆర్వోలు పాల్గొన్నారు.