Saturday, 4 April 2026
  • Home  
  • బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా షేకళ్లలో శిక్షణనా…? ఎటు పోతోంది పరి పాలన – ఏమౌతోంది ప్రజా స్వామ్యం…?? బుగ్గారం కు ఇంకా కూడా అన్యాయమేనా…??? గళమెత్తి గర్జిస్తున్న మహిళా వార్డ్ సభ్యురాలు
- News

బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా షేకళ్లలో శిక్షణనా…? ఎటు పోతోంది పరి పాలన – ఏమౌతోంది ప్రజా స్వామ్యం…?? బుగ్గారం కు ఇంకా కూడా అన్యాయమేనా…??? గళమెత్తి గర్జిస్తున్న మహిళా వార్డ్ సభ్యురాలు

బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా షేకళ్లలో శిక్షణనా…? ఎటు పోతోంది పరి పాలన – ఏమౌతోంది ప్రజా స్వామ్యం…?? బుగ్గారం కు ఇంకా కూడా అన్యాయమేనా…??? గళమెత్తి గర్జిస్తున్న మహిళా వార్డ్ సభ్యురాలు బుగ్గారం / జగిత్యాల జిల్లా: జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా శేఖల్ల గ్రామ రైతు వేదికలో ఈనెల 6 నుండి 10 వరకు ఐదు రోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాల నూతన వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని శనివారం రాత్రి నోటీసులు జారీ చేశారు. షేకళ్లలో శిక్షణనా…? ఇది పూర్తిగా అన్యాయం, పూర్తిగా ఇబ్బంది కరం, అసౌకర్యం కూడా అని బుగ్గారం గ్రామ పంచాయతీ 11 వ వార్డ్ సభ్యురాలు చుక్క లతశ్రీ ఆరోపించారు. అధికారులు, పాలక వర్గం ఆలోచించాలని, పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు పునరాలోచన చేసి ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు. మండల కేంద్రంలోనే వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు. ఈ మేరకు ఆమె అభ్యంతరం తెలుపుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయి సంబంధిత అధికారులతో పాటు సాక్షాత్తు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లకు కూడా సోషల్ మీడియా వేదికగా సందేశం పంపించినట్లు తెలిపారు. నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులు సైతం ఇంకా కూడా మండల కేంద్రమైన బుగ్గారం గ్రామానికి తీరని అన్యాయం చేసే కుట్రలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్ర పూరిత చర్యలు ఇలాగే కొనసాగితే తగు న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆమె హెచ్చరించారు.

బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా షేకళ్లలో శిక్షణనా…?

ఎటు పోతోంది పరి పాలన – ఏమౌతోంది ప్రజా స్వామ్యం…??

బుగ్గారం కు ఇంకా కూడా అన్యాయమేనా…???

గళమెత్తి గర్జిస్తున్న మహిళా వార్డ్ సభ్యురాలు

బుగ్గారం / జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో కాకుండా
శేఖల్ల గ్రామ రైతు వేదికలో ఈనెల 6 నుండి 10 వరకు ఐదు రోజుల పాటు మండలంలోని అన్ని గ్రామాల నూతన వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయడం జరిగిందని శనివారం రాత్రి నోటీసులు జారీ చేశారు.
షేకళ్లలో శిక్షణనా…? ఇది పూర్తిగా అన్యాయం, పూర్తిగా ఇబ్బంది కరం, అసౌకర్యం కూడా అని బుగ్గారం గ్రామ పంచాయతీ 11 వ వార్డ్ సభ్యురాలు చుక్క లతశ్రీ ఆరోపించారు.
అధికారులు, పాలక వర్గం ఆలోచించాలని,
పంచాయతీ అధికారులు, ఉన్నతాధికారులు
పునరాలోచన చేసి ఇప్పటికైనా సరైన నిర్ణయం తీసుకోవాలని ఆమె కోరారు.
మండల కేంద్రంలోనే వార్డ్ సభ్యులకు శిక్షణ ఏర్పాటు చేయాలని ఆమె కోరారు.
ఈ మేరకు ఆమె అభ్యంతరం తెలుపుతూ గ్రామ, మండల, జిల్లా స్థాయి సంబంధిత అధికారులతో పాటు సాక్షాత్తు జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లకు కూడా సోషల్ మీడియా వేదికగా సందేశం పంపించినట్లు తెలిపారు.
నాయకులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, ఉన్నతాధికారులు సైతం ఇంకా కూడా మండల కేంద్రమైన బుగ్గారం గ్రామానికి తీరని అన్యాయం చేసే కుట్రలు చేస్తున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి కుట్ర పూరిత చర్యలు ఇలాగే కొనసాగితే తగు న్యాయ పోరాటం చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నట్లు ఆమె హెచ్చరించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.