Thursday, 31 July 2025
  • Home  
  • బీసీ హక్కు ల మీద కాంగ్రెస్ కపట ప్రేమ : బిజెపి మాజీ ఎం ఎల్ ఏ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్
- ఖమ్మం

బీసీ హక్కు ల మీద కాంగ్రెస్ కపట ప్రేమ : బిజెపి మాజీ ఎం ఎల్ ఏ ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్

పువ్వాడ నాగేంద్ర కుమార్ (ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్) బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపుతున్న ప్రేమ కేవలం సవతి ప్రేమ మాత్రమేనని, అది కపటంతో నిండిన మోసం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఖమ్మం జిల్లా పర్యటలో భాగంగా ఖమ్మంలో హర్షా హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, ఖమ్మం పార్లమెంట్ కంటెస్టడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, సన్నే ఉదయ్ ప్రతాప్, నంబూరి రామలింగేశ్వరావ్, నున్నరవి కుమార్, పెరుమాళ్ళ పల్లి విజయ్ రాజు లతో కలిసి వారు మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై దుయ్యబట్టారు. బీసీల హక్కులను తాకట్టు పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయోగాలు చేస్తున్న ఆలోచన అంతర్వాహినిగా సాగుతోందని ఆయన అన్నారు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకల జనుల సర్వేలో బీసీ జనాభా దాదాపు 55 శాతంగా ఉన్నట్టు నివేదికలు వచ్చాయని గుర్తుచేశారు. అదే తరహాలో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వేలో బీసీ జనాభా తక్కువగా ఎలా నమోదవుతుందో చెప్పాలంటూ ప్రశ్నించారు. సర్వేలు నిర్వహించే యంత్రాంగం ఒకటే కాగా గణాంకాలు ఎలా మారతాయో వివరించాలని డిమాండ్ చేశారు. ఇది బీసీలను రాజకీయంగా అణచివేయాలన్న కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు. 42శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీ లు నష్టపోతారని చెప్పారు. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం జరగదని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీ కే లబ్ధి అని అన్నారు. బీసీ వర్గాల్లోని వాస్తవ గణాంకాలను తక్కువచేసి, ఇతర వర్గాలను బీసీ జాబితాలో చేర్చే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రమాదకరమైన చర్య అని చెప్పారు. ఇటువంటి చర్యల ద్వారా బీసీల మధ్య సామాజిక విభేదాలు కలిగించే అవకాశం ఉందని, బీజేపీ పార్టీగా దీన్ని సహించబోదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం ఓట్ల కోసమే హద్దులు దాటి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్‌ పార్టీ వాడుక భాషలో ప్రేమ చూపిస్తూ, ధృతరాష్ట్రుని కౌగిలికి మాదిరిగా ఉంటోందని పేర్కొన్నారు. వారి సమస్యలపై అసలైన పరిష్కారాలు చూపించకుండా, మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

పువ్వాడ నాగేంద్ర కుమార్
(ఖమ్మం స్టాఫ్ రిపోర్టర్)

బీసీ వర్గాల పట్ల కాంగ్రెస్ పార్టీ చూపుతున్న ప్రేమ కేవలం సవతి ప్రేమ మాత్రమేనని, అది కపటంతో నిండిన మోసం అని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకులు, ఉప్పల్ మాజీ ఎమ్మెల్యే ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ తీవ్ర విమర్శలు చేశారు. శనివారం ఖమ్మం జిల్లా పర్యటలో భాగంగా ఖమ్మంలో హర్షా హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షులు కొండపల్లి శ్రీధర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు గల్లా సత్య నారాయణ, ఖమ్మం పార్లమెంట్ కంటెస్టడ్ అభ్యర్థి తాండ్రా వినోద్ రావు, జిల్లా అధ్యక్షులు నెల్లూరు కోటేశ్వరరావు, సన్నే ఉదయ్ ప్రతాప్, నంబూరి రామలింగేశ్వరావ్, నున్నరవి కుమార్, పెరుమాళ్ళ పల్లి విజయ్ రాజు లతో కలిసి వారు మాట్లాడుతు కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై దుయ్యబట్టారు. బీసీల హక్కులను తాకట్టు పెట్టి రాజకీయ లబ్ధి కోసం ప్రయోగాలు చేస్తున్న ఆలోచన అంతర్వాహినిగా సాగుతోందని ఆయన అన్నారు.
గతంలో కేసీఆర్ ప్రభుత్వం నిర్వహించిన సకల జనుల సర్వేలో బీసీ జనాభా దాదాపు 55 శాతంగా ఉన్నట్టు నివేదికలు వచ్చాయని గుర్తుచేశారు. అదే తరహాలో ప్రస్తుత రేవంత్ రెడ్డి ప్రభుత్వం చేస్తున్న సర్వేలో బీసీ జనాభా తక్కువగా ఎలా నమోదవుతుందో చెప్పాలంటూ ప్రశ్నించారు. సర్వేలు నిర్వహించే యంత్రాంగం ఒకటే కాగా గణాంకాలు ఎలా మారతాయో వివరించాలని డిమాండ్ చేశారు. ఇది బీసీలను రాజకీయంగా అణచివేయాలన్న కుట్రలో భాగమని ఆయన ఆరోపించారు.

42శాతం రిజర్వేషన్లతో నిజమైన బీసీ లు నష్టపోతారని చెప్పారు. 10 శాతం ఈబీసీ రిజర్వేషన్లను ముస్లింలు కూడా పొందుతున్నారన్నారు. 42 శాతం రిజర్వేషన్లతో బీసీలకు న్యాయం జరగదని పేర్కొన్నారు. బీసీ రిజర్వేషన్ల వల్ల ఎంఐఎం పార్టీ కే లబ్ధి అని అన్నారు. బీసీ వర్గాల్లోని వాస్తవ గణాంకాలను తక్కువచేసి, ఇతర వర్గాలను బీసీ జాబితాలో చేర్చే కుట్ర చేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఇది సామాజిక న్యాయానికి వ్యతిరేకంగా జరుగుతున్న ప్రమాదకరమైన చర్య అని చెప్పారు. ఇటువంటి చర్యల ద్వారా బీసీల మధ్య సామాజిక విభేదాలు కలిగించే అవకాశం ఉందని, బీజేపీ పార్టీగా దీన్ని సహించబోదని స్పష్టం చేశారు. రిజర్వేషన్ల పరిమితిని 50 శాతం మించకూడదన్న సుప్రీంకోర్టు మార్గదర్శకాలు ఉన్నప్పటికీ, ప్రభుత్వం కేవలం ఓట్ల కోసమే హద్దులు దాటి మాట్లాడటం హాస్యాస్పదమని అన్నారు. బీసీల పట్ల కాంగ్రెస్‌ పార్టీ వాడుక భాషలో ప్రేమ చూపిస్తూ, ధృతరాష్ట్రుని కౌగిలికి మాదిరిగా ఉంటోందని పేర్కొన్నారు. వారి సమస్యలపై అసలైన పరిష్కారాలు చూపించకుండా, మాయ మాటలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.