రాజన్న సిరిసిల్ల జిల్లా/ మార్చి/ పున్నమి ప్రతినిధి
బీసీ సాధికారిత సంఘం రాజన్న సిరిసిల్ల జిల్లా సోషల్ మీడియా అధ్యక్షుడిగా నరేంద్ర చారిని నియమిస్తూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నియామకాన్ని ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షులు పొలాస నరేందర్ మరియు బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ సమక్షంలో ప్రకటించారు.
ఈ సందర్భంగా నరేంద్ర చారి మాట్లాడుతూ, బీసీలను జాగృతం చేసే దిశగా తనపై నమ్మకం ఉంచి ఈ బాధ్యతలను అప్పగించిన బీసీ సాధికారిత సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య, ఉత్తర తెలంగాణ జిల్లాల అధ్యక్షులు పొలాస నరేందర్, అలాగే రాష్ట్ర యూత్ వర్కింగ్ ప్రెసిడెంట్ మెంగని మనోహర్ గారికి తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.
సంఘం బలోపేతం కోసం, బీసీల హక్కులు మరియు సమస్యలను సోషల్ మీడియా వేదికగా ప్రజలకు తెలియజేస్తూ పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు.


