ఏ. పి.లోని రాష్ట్ర బీసీ కుల సంఘాలు తమ హక్కుల సాధన కోసం ముందుకు వస్తున్న నేపథ్యంలో ఏ. పి.రాష్ట్రంలోని గాండ్ల తెలికుల దేవతెలికుల సంఘాలు ఐక్యతతో ముందుకు సాగాలని ఏ.పి.అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ ఉపాద్యాయ పెన్షనర్ ల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు వాకాటి హరికృష్ణ పిలుపు నిచ్చారు.శనివారం ఆయన ఇక్కడికి వచ్చిన సందర్భంగా స్ధానిక పత్రికలకు ఓ ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలోని గాండ్ల ఉప కులాలకు సంభందించి రాష్ట్ర ప్రభుత్వం తరపున కార్పొరేషన్ ఏర్పాటు అవుతుందా?లేదా?అన్న చర్చలు జరుగుతున్న సమయంలో మూడు ప్రాంతాలలో వుంటున్న మన కులస్థులు ఐక్యతా రాగం చాటుకోవాలన్నారు.ఆంధ్ర ఉత్తరాంధ్ర రాయలసీమ లలో వుంటున్న వారందరము మన ఉనికిని చాటుకోవడంతో పాటు ఒకే జెండా ఎజెండా అనే నినాదం తో కదలిరావాలన్నారు.మనతరం – భావితరాల భవిష్యత్తూ పిల్లల కోసం సాధించాల్సింది ఇంకనూ ఎన్నో అంశాలు ఉన్నాయన్నారు.ఐక్యతతో సాగితే ఏదైనా సాధించవచ్చన్నారు.కనుక మన కులస్థులు ఐక్యతా రాగం కోసం ఏకాభిప్రాయంతో ముందుకు రావాలని కోరారు.

బీసీ సంఘాలు ఏకమవుతున్న వేళ… గాండ్ల కులస్థులు కూడా ఐక్యమవుదాo